Share News

అమెరికాలో గుజరాత్ మహిళ హత్య

ABN , Publish Date - May 26 , 2026 | 03:49 PM

అమెరికాలోని వర్జీనియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన భారతీయ మహిళలపై దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

అమెరికాలో గుజరాత్ మహిళ హత్య
Meghnaben Patel

వర్జీనియా: అమెరికాలోని వర్జీనియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన భారతీయ మహిళలపై దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గత పదేళ్లుగా ఇదే సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న ఆ మహిళను 45 ఏళ్ల మేఘనాబెన్ పటేల్‌గా గుర్తించారు. గుజరాత్‌‌లోని బిజాపుర్ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘన తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.


సీసీటీవీలో నమోదైన ఘటన వివరాల ప్రకారం, ట్రాక్ సూట్, గ్రే జాకెట్, ఫేస్ మాస్క్ ధరించిన ఒక వ్యక్తి కస్టమర్‌లా సూపర్‌మార్కెట్‌లో ప్రవేశించాడు. కౌంటర్‌ దగ్గర ఉన్న మేఘానాబెన్‌తో మాట్లాడుతూ అకస్మాత్తుగా జేబులోంచి గన్ తీసి ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలికి భర్త ఉపేంద్ర పటేల్, కుమార్తె నక్షిబెన్, కుమారుడు స్మిత్ ఉన్నారు.


కాగా, సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ చేపట్టారు. దుండగుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. దోపిడీ ఉద్దేశంతోనే ఈ కాల్పులు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్ ‘ఇజ్రాయెల్’ షరతుకు పాకిస్తాన్ నో! అబ్రహం అకార్డ్స్‌పై వెనక్కి తగ్గేదే లేదన్న ఇస్లామాబాద్

యురేనియంను అమెరికాకు అప్పగించాలి లేదా నాశనం చేయాలి.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

Updated Date - May 26 , 2026 | 03:56 PM