బ్రిటన్‌లో 40 డిగ్రీలకే రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా తట్టుకుంటాయి..
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:11 AM
గత కొద్ది రోజులుగా యూరప్ దేశాలను భానుడు విలవిలలాడిస్తున్నాడు. ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరప్ శీతల దేశాలు భగభగమంటున్నాయి.
గత కొద్ది రోజులుగా యూరప్ దేశాలను భానుడు విలవిలలాడిస్తున్నాడు. ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరప్ శీతల దేశాలు భగభగమంటున్నాయి. కేవలం 40 డిగ్రీల వేడికే అక్కడి రోడ్లు మెత్తబడడం, కరిగిపోవడం కనబడుతోంది. అయితే మన దేశంలో 45 డిగ్రీలు దాటినా రోడ్లు సాధారణంగానే ఉంటాయి. దీని వెనుక కారణం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది (UK roads melt).
బ్రిటన్ వంటి యూరప్ దేశాల్లో చలికాలంలో కురిసే మంచును, గడ్డకట్టే ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రోడ్లను రూపొందిస్తారు. అక్కడ ఎక్కువగా హాట్ రోల్డ్ ఆస్ఫాల్ట్ (HRA), డెన్స్ ఆస్ఫాల్ట్ కాంక్రీట్ వంటి మిశ్రమాలను ఉపయోగిస్తారు. వీటిలో బిటుమెన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ బిటుమెన్ కారణంగానే తీవ్రమైన చలిని, మంచును కూడా రోడ్లు తట్టుకుంటాయి. అయితే ఇదే బిటుమిన్ 40 డిగ్రీల వేడికి మెత్తబడుతుంది (Europe heatwave).
ఇక, భారత్‌లోని రోడ్ల నిర్మాణంలో వీజీ-30, వీజీ-40 వంటి అధిక సాంద్రత కలిగిన బిటుమెన్‌ను ఉపయోగిస్తారు. అలాగే పెద్ద పరిమాణంలోని రాళ్ల మిశ్రమాన్ని వినియోగిస్తారు. వీటి వల్ల రోడ్లు అధిక ఉష్ణోగ్రతలను, భారీ ట్రాఫిక్‌ను కూడా సమర్థంగా తట్టుకుంటాయి. అందుకే మనదేశంలోని రోడ్లు ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా సులభంగా మెత్తబడవు (India roads heat).
ఇక, యూరప్ దేశాల్లోని ఇళ్లను కూడా అక్కడి చలి వాతావరణానికి తగ్గట్టుగానే నిర్మించుకుంటారు. వేడిని పట్టి ఉంచేలా అక్కడి ఇళ్ల నిర్మాణం ఉంటుంది. పైగా అక్కడ 90 శాతం ఇళ్లలో ఫ్యాన్‌లు, ఏసీలు ఉండవు. చలి కారణంగా వాటి అవసరం వారికి ఉండదు. అయితే ప్రస్తుతం గతంలో లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వారు వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
భారత్ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది.. చుట్టూ కఠినమైన దేశాలు: అమెరికా రాయబారి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..