Share News

వైట్‌హౌస్‌ దగ్గర కలకలం.. భద్రతా దళాల కాల్పుల్లో దుండగుడి మృతి

ABN , Publish Date - May 24 , 2026 | 06:37 AM

అమెరికాలోని వైట్‌హౌస్‌ దగ్గర కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఓ దుండగుడు వైట్‌హౌస్ చెక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు.

వైట్‌హౌస్‌ దగ్గర కలకలం.. భద్రతా దళాల కాల్పుల్లో దుండగుడి మృతి
White House shooting

న్యూయార్క్, మే 24: అమెరికాలోని వైట్‌హౌస్‌ దగ్గర కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఓ దుండగుడు వైట్‌హౌస్ చెక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఆఫీసర్లు జరిపిన ఎదురు కాల్పుల్లో గాయాలపాలైన దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్ తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఓ దుండగుడు 17వ స్ట్రీట్‌, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని వైట్‌హౌస్ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చాడు.


తన బ్యాగులోనుంచి గన్ బయటకు తీసి, అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన ఆఫీసర్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆఫీసర్లు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. దుండగుడి కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. సెక్యూరిటీ ఆఫీసర్లకు ఏమీ కాలేదు. ఈ సంఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

అటవీ విస్తీర్ణంలో దేశంలో ఏపీదే ప్రథమ స్థానం

పారిశ్రామిక విప్లవానికి పునాది

Updated Date - May 24 , 2026 | 06:49 AM