దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి!
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:01 AM
దుబాయిలోని భారతీయ కాన్సులేట్‌లో అత్యున్నత అధికారిగా తెలుగు దౌత్యవేత్త నియామకం దాదాపు ఖరారైంది. భారతీయ కాన్సుల్ జనరల్‌గా 2008 బ్యాచ్‌కు చెందిన...
గత 50 ఏళ్లలో మొదటి సారి తెలంగాణ వాసికి అవకాశం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయిలోని భారతీయ కాన్సులేట్‌లో అత్యున్నత అధికారిగా తెలుగు దౌత్యవేత్త నియామకం దాదాపు ఖరారైంది. భారతీయ కాన్సుల్ జనరల్‌గా 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్ అధికారి ఇమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డిని భారత ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వైద్య విద్య పూర్తి చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పటి వరకు ఆయన డిప్యుటేషన్‌పై తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల వ్యవహారాలను పర్యవేక్షించారు. ఐరోపా, అమెరికా దేశాలతోపాటు ఐక్యరాజ్య సమితిలోనూ పనిచేసిన ఆయన... గతంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిగా సేవలు అందించారు. గత 50 ఏళ్లలో మొదటి సారి దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌గా తెలంగాణ వాసికి అవకాశం దక్కడం గమనార్హం. విష్ణువర్ధన్‌రెడ్డి నియామకం ఖరారైతే గల్ఫ్ దేశాల్లో మొత్తం ముగ్గురు తెలుగు అధికారులు అత్యున్నత హోదాలో ఉంటారు. ఇప్పటికే సౌదీలోని జెద్ధాలో ఫహాద్ ఖాన్ సూరి(కర్నూలు), ఖతర్‌లో కొప్పుల శ్రీకర్‌రెడ్డి (నల్లగొండ) బాధ్యతులు నిర్వరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News