వెనెజువెలాలో 58,870 భవనాలు ధ్వంసం !
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:58 AM
వెనెజువెలాలో గత వారం సంభవించిన రెండు శక్తిమంతమైన భూకంపాలు ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. జూన్ 24న సంభవించిన భూకంపాల వల్ల...
నాసా ఉపగ్రహ రేడార్ సమాచారంతో అంచనా
855 భవనాలు దెబ్బతిన్నాయి.. 189 కూలాయి
వెనెజువెలా అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటన
వాషింగ్టన్, జూన్ 30 : వెనెజువెలాలో గత వారం సంభవించిన రెండు శక్తిమంతమైన భూకంపాలు ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. జూన్ 24న సంభవించిన భూకంపాల వల్ల వెనెజువెలాలో సుమారు 58.870 భవనాలు ధ్వంసం అయ్యాయని పరిశోధకులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో కొన్ని భవనాలు పూర్తిగా కూలిపోగా మరికొన్ని ధ్వంసం అయ్యాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహాల నుంచి జూన్ 25న సేకరించిన ఉపగ్రహ రేడార్ సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. క్షేత్రస్థాయిలో జరిగిన విధ్వంసాన్ని అంచనా చేసి సహాయక బృందాలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే, భూకంపాల వల్ల 855 భవనాలు దెబ్బ తిన్నాయని ఇందులో 189 మాత్రం కూలిపోయాయని వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షడు జార్జ్ రోడ్రిగ్జ్ సోమవారం ప్రకటించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!