గ్రీన్‌కార్డు, హెచ్-1బీ దరఖాస్తుదారులకు కొత్త రూల్స్
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:44 AM
గ్రీన్ కార్డు, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ను నింపే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ‘ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసె్‌స
న్యూయార్క్, జూలై 8: గ్రీన్ కార్డు, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ను నింపే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ‘ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసె్‌స’(యూఎ్‌ససీఐఎస్) ఒక ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుపై చేయాల్సిన సంతకం విషయంలో మారిన నిబంధనలను జాగ్రత్తగా గమనించాలని కోరింది. జూలై 10 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లేని దరఖాస్తును తిరిగి దరఖాస్తుదారునికి పంపిస్తామని, దిద్దుబాటు చర్యలకు అవకాశం లేదని యూఎ్‌ససీఐఎస్ తెలిపింది. అయితే తప్పులను సరిచేసి, అవసరమైన ఫీజును చెల్లించి దరఖాస్తును తిరిగి సమర్పించవచ్చని పేర్కొంది. ‘దరఖాస్తులో సంతకం పెట్టాల్సిన చోట పేరు టైప్ చేయడం, సంతకం తయారీకి డిజిటల్ టూల్స్ ఉపయోగించడం కుదరదు. చట్టపరమైన అనుమతి ఉంటే తప్ప అటార్నీ, ఏజెంట్లు దరఖాస్తుదారుని తరఫున సంతకం చేయడం కూడదు. సిగ్నేచర్ స్టాంపులు, ఆటో పెన్నులను ఉపయోగించ కూడదు. యూఎ్‌ససీఐఎస్ ఆథరైజ్ చేసిన సాఫ్ట్‌వేర్ జనరేటెడ్ సంతకాలు మినహా, మరే ఇతర సంతకాలను వాడకూడదు’ అని ఇమ్మిగ్రేషన్ విభాగం పేర్కొంది. ‘దరఖాస్తును సమర్పించే ముందు చేతితో సంతకం చేయడం తప్పనిసరి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నట్లయితే... స్కాన్ చేసిన సంతకం కానీ, సంతకం ఫొటోకాపీ కానీ చెల్లుబాటు అవుతుంది. దరఖాస్తుదారు 14 ఏళ్లలోపు అయితే తల్లిదండ్రులు కానీ, లీగల్ గార్డియన్ కానీ చేయవచ్చు. తదుపరి సంప్రదింపులకు సంతకం చేసిన ఒరిజినల్ దరఖాస్తులను భద్రపరుచుకోవాలి’ అని యూఎ్‌ససీఐఎస్ వివరించింది.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్