Share News

ట్రంప్‌తో సమావేశాన్ని రద్దు చేసుకుంటాం.. చైనా అధ్యక్షుడి వార్నింగ్

ABN , Publish Date - Sep 13 , 2026 | 10:31 PM

మరికొన్ని రోజుల్లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో జరగనున్న సమావేశాన్ని రద్దు చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ట్రంప్‌తో సమావేశాన్ని రద్దు చేసుకుంటాం.. చైనా అధ్యక్షుడి వార్నింగ్
Xi Jinping, Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని రోజుల్లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో జరగనున్న సమావేశాన్ని రద్దు చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌లో ఇరు దేశాధినేతలూ సమావేశం కావాల్సి ఉంది. అయితే, తైవాన్‌కు ఆయుధ విక్రయాల విషయంలో యూఎస్‌పై చైనా గుర్రుగా ఉంది. ఈ విషయంలో యూఎస్ హద్దు దాటకూడదని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.

ఇటీవల బీజింగ్‌లో సమావేశం సందర్భంగా కూడా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ యూఎస్‌కు కీలక హెచ్చరిక చేశారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ‘యూఎస్-చైనా దౌత్యబంధంలో తైవాన్ అంశం చాలా ముఖ్యమైనది. ఈ అంశంలో పొరపాట్లు జరిగితే ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగే అకాశం ఉంది. విపత్కర పరిస్థితులు ఉత్పన్నం కావొచ్చు’ అని నేరుగా పేర్కొన్నారు.


తైవాన్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. అవసరమైతే బలప్రయోగంతో తైవాన్‌ను మళ్లీ చైనాలో కలుపుకుంటామని హెచ్చరించింది.

ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చైనా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు కామెంట్ చేశారు. ఇప్పటికే ఇండో పసిఫిక్ ప్రాంతం నుంచి యూఎస్ తన యుద్ధ నౌకలు, మిసైళ్లను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా, చైనా విషయంలో దూకుడుగా ఉంటున్న జపాన్‌ను కూడా యూఎస్ పలుసార్లు మందలించింది.


ఈ వార్తలనూ చదవండి:

కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ అధ్యక్షుడు

మోదీ ఇచ్చిన బ్రిక్స్ విందుకు జిన్‌పింగ్ ఎందుకు వెళ్లలేదు.. అసలు కారణం ఇదేనా..

Updated Date - Sep 13 , 2026 | 11:27 PM