Share News

కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ అధ్యక్షుడు

ABN , Publish Date - Sep 13 , 2026 | 09:34 PM

పశ్చిమాసియాలో శాంతినెలకొల్పేందుకు బ్రిక్స్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గతాన్ని పక్కన పెట్టి యూఏఈతో కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు.

కొత్త అధ్యాయాన్ని  ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ అధ్యక్షుడు
Iran President, UAE Crown Prince

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో శాంతినెలకొల్పేందుకు బ్రిక్స్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గతాన్ని పక్కన పెట్టి యూఏఈతో కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో ఆయన యూఏఈ యువరాజు జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని చెప్పారు. కొత్త భవిష్యత్తు నిర్మాణం దిశగా అడుగులు వేసేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. యూఏఈలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులతో ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే.

‘మాకు యూఏఈతో గాని, ఇతర గల్ఫ్ దేశాలతో గానీ ఎలాంటి సమస్యలూ లేవు. కానీ ఆ దేశాల్లో అమెరికా తన సైనిక స్థావరాలను కొనసాగించడం, వాటితో ఇరాన్‌పై దాడులు చేయడాన్ని మాత్రం సహించేది లేదు’ అని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.


యూఏఈతో సహా వివిధ ఎమిరేట్స్, ఇతర గల్ఫ్ దేశాలు తమకు సోదర సమానమని అన్నారు. ఎన్నో శతాబ్దాలుగా తాము కలిసి జీవిస్తున్నామని చెప్పారు. తమ మధ్య వాణిజ్యం కూడా ఉందని అన్నారు. అవసరమైన సందర్భాల్లో పరస్పరం సహకరించుకునే వాళ్లమని గుర్తు చేశారు. అయితే, ఈ సమావేశాన్ని తాను పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక పశ్చిమాసియాలో ఘర్షణలపై బ్రిక్స్ దేశాలూ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని తాజా బ్రిక్స్ సమావేశంలో తీర్మానించాయి.


ఈ వార్తలనూ చదవండి:

మరో 25 ఏళ్లల్లో యూఎస్‌ను అధిగమించనున్న భారత్: ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

Updated Date - Sep 13 , 2026 | 09:38 PM