Share News

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 02:51 PM

బ్రిక్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు.

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
PM Modi, President Xi Jinping

బ్రిక్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాలు సమానమే అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు చాలా ఒడిదుడుకులకు లోనవుతున్నాయని అన్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వ పోకడలకు గ్లోబల్ సౌత్ అభివృద్ధే సమాధానమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు తమ మధ్య ఐక్యత, సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


మరోవైపు, బ్రిక్స్ సమావేశాలను విజయవంతం చేసినందుకు వివిధ దేశాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. బ్రిక్స్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మేలిమార్పులు తీసుకొచ్చేలా న్యూఢిల్లీ డిక్లరేషన్ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు కాలపరిమితి విధించుకుని ముందుకు సాగాలని అన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధం కాదని కూడా ప్రధాని మోదీ చెప్పారు. సమస్యలను పరిష్కరించే ఓ వ్యవస్థగా బ్రిక్స్ కూటమి మారిందన్న నమ్మకం తాజా సమావేశాలు కలిగించాయని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ

‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ

Updated Date - Sep 13 , 2026 | 03:05 PM