మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి.. ప్రపంచ నేతల కామెంట్స్
ABN , Publish Date - Nov 04 , 2026 | 09:51 PM
యూఎస్ మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలపై ప్రపంచ నేతలు ఏమన్నారంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విధానాలతో పలు దేశాలకు చుక్కలు చూపించారు. అమెరికన్లకు మేలు చేసేందుకే ఈ విధానాలు అవలంబిస్తున్నానని చెప్పారు. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో మాత్రం అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఘోర ఓటమిని చవిచూశారు. ఈ ఫలితాలపై వివిధ దేశాల్లోని నేతలు పలు కీలక కామెంట్స్ చేశారు.
ఇరాన్: మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాల తరువాత ట్రంప్ ఇరాన్ విషయంలో తన తీరు మార్చుకుంటారని తాను భావించట్లేదని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కామెంట్ చేశారు. యుద్ధాన్ని అమెరికన్లు తిరస్కరించారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ వ్యాఖ్యానించారు.
స్పెయిన్: ట్రంప్ రాజకీయ విధానాలను అమెరికన్లు తిరస్కరించారని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంఛెజ్ తెలిపారు. ఇది ద్వేషానికి వ్యతిరేకంగా ప్రజాతీర్పు అని అన్నారు.
రష్యా: మిడ్‌టర్మ్‌పై రష్యా ఆచితూచి స్పందించింది. శాంతిస్థాపనకు ట్రంప్ తన దౌత్యప్రయత్నాలను కొనసాగించాలని ఆశిస్తున్నట్టు రష్యా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా ఓ అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని రష్యా చట్టసభల సభ్యుడు లియోనిడ్ స్లస్కీ అభిప్రాయపడ్డారు.
ఈయూ: ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు, పర్యావరణ రక్షణకు ఈ ఫలితాలు మేలు కలిగించే అవకాశం ఉందని యూరోపియన్ పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్ క్రిస్టెల్ పేర్కొన్నారు.
యూకే: అమెరికా రాజకీయాల్లో మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు ఓ కీలక పరిణామమని యూకే ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు.
చైనా: మిడ్‌టర్మ్ ఫలితాలు అమెరికా అంతర్గత విషయమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు.
నార్వే: అమెరికా ప్రజలు కొత్త రాజకీయ దిశను కోరుకుంటున్నట్టు మిడ్‌టర్మ్ ఫలితాలు స్పష్టం చేశాయని నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ తెలిపారు.
దక్షిణాఫ్రియా: భౌగోళిక రాజకీయాల్లో ఇదో కీలక మలుపని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే..
మిడ్‌టర్మ్ ఎన్నికల సర్‌ప్రైజ్.. యూఎస్‌లో తొలి ముస్లిం సెనెటర్