Share News

క్యూబాకు రష్యా చమురు.. అమెరికా ఎందుకు వెనక్కి తగ్గింది..

ABN , Publish Date - Mar 31 , 2026 | 09:58 AM

తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్‌ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

క్యూబాకు రష్యా చమురు.. అమెరికా ఎందుకు వెనక్కి తగ్గింది..
Cuba fuel crisis

తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్‌ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే. క్యూబా చుట్టూ అమెరికా సేనలు మోహరించి ఉన్నాయి. నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా దిగ్బంధనాన్ని దాటి రష్యా నౌక క్యూబా చేరుకుంది. రష్యాకు చెందిన 'అనటోలీ కొలోడ్కిన్‌' ట్యాంకర్‌ లక్ష టన్నుల ముడి చమురుతో మాతాన్జాస్‌ నౌకాశ్రయానికి చేరుకుంది (Trump Cuba policy).


అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నౌక క్యూబా వైపు పయనం కావడంతో మరో యుద్ధం ప్రారంభమవుతుందేమో అనే ఆందోళన నెలకొంది. అయితే రష్యా నౌకను అమెరికా అడ్డుకోకపోవడం ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా ట్రంప్ వెనక్కి తగ్గడం చాలా మందికి షాకిచ్చింది. అయితే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ, వ్యూహాత్మక కారణాల వల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది (US Cuba blockade).


క్యూబాలో భారీగా ఇంధన కొరత వల్ల విద్యుత్ సంక్షోభం మొదలైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పూర్తిగా బ్లాకేడ్ కొనసాగితే మానవతా విమర్శలు పెరుగుతాయి. క్యూబా విషయంలో చాలా దేశాలు అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చాయి. తన అంతర్జాతీయ ఇమేజ్‌ను మెరుగుపరుచుకునేందుకే అమెరికా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు చమురును అనుమతించకపోతే క్యూబా మరింతగా రష్యాకు చేరువయ్యే ప్రమాదం ఉంది (Trump Russia Cuba oil).


అమెరికాలో క్యూబాకు చెందిన ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు (Cuba sanctions news). వారిని బుజ్జగించేందుకు కూడా ట్రంప్ ఇలా వెనక్కి తగ్గారు. ఇక, ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో కూరుకుపోయిన అమెరికా.. రష్యా నౌకను అడ్డుకుని మరో యుద్ధానికి తెరతీయడానికి సిద్ధంగా లేదు. ఈ కారణాలన్నింటి వల్లే క్యూబా విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. అయితే ట్రంప్ పూర్తిగా క్యూబా చుట్టూ బ్లాకేడ్ తీసెయ్యలేదు. క్యూబాకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని మాత్రమే చెప్పారు.


ఇవి కూడా చదవండి..

పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 31 , 2026 | 10:04 AM