మొక్కల మధ్యలో జింక.. 15 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
ABN , Publish Date - Mar 31 , 2026 | 08:15 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
పజిల్స్ అనేవి కేవలం టైమ్‌పాస్ కోసం మాత్రమే కాదు. అవి మన మెదడుకు ఒక అద్భుతమైన వ్యాయామం. అన్ని వయసుల వారు ఆసక్తిగా వీటిని పరిష్కరించడం వల్ల మానసిక ఉల్లాసం పొందుతారు. ఒక పజిల్‌ను సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే సమయంలో, ఈ ప్రక్రియ మనలో ఆలోచనా తీరు, విశ్లేషణా సామర్థ్యం మరియు నిర్ణయాల తీసుకునే శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే పజిల్స్‌ను ఒక రకంగా 'బ్రెయిన్ ట్రైనింగ్ టూల్'గా కూడా పరిగణిస్తారు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ టెస్ట్. ఆ ఫొటోలో ఒక కొండపై కొన్ని కాక్టస్ మొక్కలు కనబడుతున్నాయి. చుట్టూ అందమైన ప్రకృతి ఉంది. అయితే అక్కడ ఒక జింక కూడా ఉంది. నిశితంగా పరిశీలిస్తేనే ఆ జింక మీకు కనబడుతుంది. ఆ జింకను కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. ఆ జింకను 15 సెకెన్ల వ్యవధిలో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 15 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో జింక ఎక్కడుందో మీకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..
పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..