హెలికాప్టర్ దిగుతూ తూలిన ఉషా వాన్స్.. సెక్యూరిటీ సిబ్బందిపై విమర్శలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 02:04 PM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ హెలికాప్టర్ దిగుతూ తూలిపడబోయి మళ్లీ నిలదొక్కుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ హెలికాప్టర్ దిగుతూ తూలిపడబోయి మళ్లీ నిలదొక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్నికల ప్రచారం కోసం ఆమె భర్త, బిడ్డలతో సహా అలాస్కా వెళ్లారు. అక్కడ ముందుగా ఆమె తన నవజాతశిశువును ఎత్తుకుని కిందకు దిగుతూ తూలిపడబోయారు. ఆ తరువాత జేడీ వాన్స్ కూడా కిందకు దిగారు. అయితే ఉష తూలిపడబోయిన విషయాన్ని జేడీ వాన్స్ గమనించినట్టు లేదు.
అయితే, ఉషా వాన్స్ తూలిన సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది స్పందించని తీరుపై నెట్టింట రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిడ్డతో సహా ఉష తూలినా కూడా సిబ్బంది కనీసం వీసమెత్తైనా కదలకుండా అక్కడ నిలబడి చూశారని కొందరు విమర్శలు గుప్పించారు. అయితే, సిబ్బంది ఎందుకు స్పందించలేదు? అసలు ఆ సమయంలో ఏం జరిగిందీ అనే విషయాలపై మాత్రం స్పష్ట రాలేదు.
ఉష, వాన్స్ దంపతులకు నలుగురు సంతానం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఉష నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు. నవజాత శిశువు అలెక్‌తో పాటు ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. వారి పెద్ద కుమారుడు ఇవాన్‌కు తొమ్మిదేళ్లు, వివేక్‌కు ఆరు, కూతురు మిరాబెల్‌కు నాలుగేళ్లు ఉన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌లో పౌరసత్వ రద్దుకు చర్యలు.. మునుపెన్నడూ చూడని స్థాయిలో..
కెప్టెన్ మచ్చార్ పుర్రెకు ఎమర్జెన్సీ సర్జరీ