మిత్రదేశం ఒమన్‌కు యూఎస్ గట్టి వార్నింగ్
ABN , Publish Date - May 28 , 2026 | 09:50 PM
హోర్ముజ్‌లో టోల్ విధింపు కోసం ఇరాన్‌కు ఎవరు సహకరించినా తమ ఆంక్షలను ఎదుర్కోక తప్పదని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ మిత్రదేశం ఒమన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ విషయంలో అమెరికా మరోసారి గట్టి హెచ్చరిక చేసింది. హోర్ముజ్ జలసంధిలో టోల్ విధింపు కోసం ఇరాన్‌కు ఎవరైనా సహకరిస్తే ఊపేక్షించేది లేదని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా హెచ్చరించారు. ఒమన్ దేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ ఈ వార్నింగ్ ఇచ్చారు.
‘ఒమన్‌కు ప్రత్యేకంగా చెప్పేదేంటంటే.. హోర్ముజ్‌లో టోల్ విధింపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు సహకరించినా చర్యలు తీసుకుంటాము’ అని ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. టోల్ విధింపు కోసం జరిగే ఏ చర్యనూ అమెరికా సహించదని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు దిశగా మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్‌కు అమెరికా ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఒమన్‌ను కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కూడా ఒమన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ టోల్‌ను ఒమాన్‌తో పంచుకుంటామని ఇరాన్ ప్రతిపాదించినట్టు వచ్చిన వార్తలను ఉద్దేశిస్తూ.. వాళ్లను పేల్చి పారేస్తానని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిత్రదేశం ఒమన్‌ను ఉద్దేశించే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న మీడియా ప్రశ్నకు శ్వేతసౌధం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. హోర్ముజ్‌లో టోల్ వసూలుకు ఉద్దేశించిన ఇరాన్ నూతన సంస్థ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీపై తాజాగా అమెరికా ట్రెజరీ ఆంక్షలను విధించింది. ఆ తరువాత కొన్ని గంటలకే మంత్రి బెసెంట్ సోషల్ మీడియా వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే వారందరూ ఈ ఆంక్షలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్‌లో మందుపాతరల వేట.. ప్రత్యేక నౌకను పంపిన బ్రిటన్..
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులు..