ఇప్పటికీ అక్కడే 20కిపైగా యుద్ధనౌకలు.. యూఎస్ వార్నింగ్
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:24 PM
ఇరాన్‌తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం మరో వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ 20కిపైగా యుద్ధనౌకలు సిద్ధంగానే ఉంచామని చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం మరో వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ 20కిపైగా యుద్ధనౌకలు సిద్ధంగానే ఉంచామని చెప్పింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇరాన్ దిగ్బంధనం అమల్లోకి వచ్చిన నాటి నుంచీ ఇప్పటివరకూ 55 కమర్షియల్ నౌకలను దారి మళ్లించామని, రెండింటిని కదలకుండా చేశామని చెప్పింది. మరో రెండు నౌకలపై తమ సిబ్బంది ఎక్కి దిగ్బంధనాన్ని కట్టుదిట్టంగా అమలు చేశామని పేర్కొంది. ‘యూఎస్ఎస్ రాస్‌పై మా నావికులు కట్టుదిట్టమైన పహారా కాస్తున్నారు. యూఎస్ఎస్ రాస్ సహా 20కి పైగా యుద్ధ నౌకలను అక్కడ మోహరించాము. కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నాము’ అని పేర్కొంది.
హోర్ముజ్‌ను తెరవాలంటే తమ డిమాండ్స్‌కు అమెరికా అంగీకరించాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో సురక్షితమైన మార్గాలను ఖరారు చేసే దిశగా ఒమాన్‌తో ఒప్పందం త్వరలో ఖరారు అవుతుందని కూడా ఇరాన్ తెలిపింది. అయితే, తమ షరతులకు అమెరికా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది. దాడుల్లో ఇరాన్‌కు జరిగిన నష్టానికి గాను పరిహారం చెల్లించాల్సిందేనని చెబుతోంది. వీటితో పాటు అమెరికా తన బెదిరింపులను కట్టిపెడితేనే హోర్ముజ్ మళ్లీ తెరుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, హోర్ముజ్‌ను తెరిపించేందుకు అణు డీల్‌ను కూడా యూఎస్ తాత్కాలికంగా పక్కనపెట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు..
ఎన్‌సీపీఐలో అభిప్రాయభేదాలు.. బీజేపీకి మద్దతుపై ముగ్గురు సభ్యుల అభ్యంతరం!