Share News

కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు..

ABN , Publish Date - Aug 10 , 2026 | 10:49 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అమీన్‌తో పాటు అయన మిత్రుడికి గాయాలయ్యాయి.

కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు..
AR Rahman son accident

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయన మిత్రుడికి గాయాలయ్యాయి. చెన్నైలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున అమీన్ తన పోర్షే కారులో మిత్రుడితో కలిసి గిండి వైపు వెళుతున్నారు. గిండి సమీపంలోని ఒలంపియా టెక్ పార్క్ సిగ్నల్ వద్ద 3.30 గంటల ప్రాంతంలో వాగాన్ ఆర్ కారు అమీన్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమీన్, ఆయన మిత్రుడికి స్వల్ప గాయాలయ్యాయి.


స్థానికులు చికిత్స నిమిత్తం ఇద్దరినీ కావేరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారు ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. వాగాన్ ఆర్ కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. అతడిని కళైంగర్ సెంటెనరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతడు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Updated Date - Aug 10 , 2026 | 12:24 PM