ఇరాన్‌కు ప్రత్యేక దళాలను పంపే యోచనలో యూఎస్.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:29 PM
ఇరాన్‌లోని శుద్ధి చేసిన యూరేనియంను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపడంపై అమెరికా, ఇజ్రాయెల్‌లు చర్చిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో ప్రత్యేక దళాలను దించే యోచనలో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అక్కడి శుద్ధి చేసిన యురేనియమ్ నిల్వలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రత్యేక దళాలను వినియోగించడంపై ఇరు దేశాలు చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే, యుద్ధం తదుపరి దశల్లో ఇలాంటి ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
మీడియా కథనాల ప్రకారం, ప్రత్యేక దళాల సాయంతో ఇరాన్‌లోని దాదాపు 650 కేజీల శుద్ధి చేసిన యూరేనియం నిల్వలను బయటకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేదా ప్రత్యేక దళాలతో పాలు కొందరు నిపుణులను పంపించి యూరేనియంను పలు ప్రక్రియల ద్వారా అణ్వాయుధ తయారీకి పనికిరాకుండా చేసే అంశాన్ని కూడా అమెరికా, ఇజ్రాయెల్‌లు పరిశీలిస్తున్నాయట. ఇందుకోసం అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేక దళం డెల్టా ఫోర్స్‌ను రంగంలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లోగల అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. ఇజ్రాయెల్‌పైనా మిసైల్స్, డ్రోన్స్‌తో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లను హత్య చేసే వారిని వేటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించారు. భూమ్మీద ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సంకోచాలు ఉండవని కూడా అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా శనివారం ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని విజయవంతంగా తుడిచిపెట్టేశామని అన్నారు. ప్రపంచం నుంచి ఒక ప్రమాదకరమైన క్యాన్సర్‌ను తొలగించామని వ్యాఖ్యానింరచారు. మిలిటరీ చర్యల పురోగతిపై కూడా ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధంలో గెలుస్తున్నామని అన్నారు. మరికొంత కాలం ఈ పోరు సాగుతుందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
బహ్రెయిన్‌పై ఇరాన్ దాడి.. 21 మంది అమెరికా సైనికులు మృతి
అతడెవరో కూడా తెలియదు, ఆ హెచ్చరికలను లెక్కచేయను: ట్రంప్