ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. సగటున రోజుకు ఒక విహంగాన్ని కోల్పోయిన యూఎస్
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:03 PM
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మొదలుపెట్టిన నాటి నుంచీ అమెరికా సగటున రోజుకు ఒక ఎయిర్ క్రాఫ్ట్‌ను కోల్పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిల్లో అధిక శాతం డ్రోన్స్ అని తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై యూఎస్ దాడులు ప్రారంభించి 39 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పరిస్థితులు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట మొదలుపెట్టిన ఈ దాడులతో అమెరికాకు యుద్ధ ఖర్చులు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటితో పాటు యూఎస్ రోజుకు ఒక ఎయిర్‌క్రాఫ్ట్ చొప్పున నష్టపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఫిబ్రవరి 28న దాడులు మొదలు పెట్టిన అమెరికా ఇప్పటివరకూ సుమారు 13 వేల సార్లు ఇరాన్‌పై యుద్ధ విమానాలు, డ్రోన్స్‌ను పంపించింది. ఈ క్రమంలో సగటున రోజుకు ఒక ఎయిర్‌క్రాఫ్ట్ చొప్పున యూఎస్ కోల్పోయింది. వీటిల్లో అధిక శాతం రీపర్ డ్రోన్స్ అని సమాచారం. మొత్తం 24 ఎమ్‌క్యూ-9 రీపర్ డ్రోన్స్‌ను అమెరికా కోల్పోయింది. ఇటీవల అత్యంత ఖరీదైన ఎమ్‌క్యూ-4సీ డ్రోన్ కూడా హోర్ముజ్ గగనతలంలో అదృశ్యమైంది. ఈ డ్రోన్‌కు ఏమైందనేది ఇప్పటికీ తెలియరాలేదు.
డ్రోన్స్‌తో పాటు యుద్ధ విమానాలను కూడా యూఎస్ కోల్పోయినట్టు వార్తలు వెలువడ్డాయి. నాలుగు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్స్ విమానాలు, ఒక ఏ-10 వార్థాగ్ ఫైటర్‌జెట్‌ను యుద్ధ క్షేత్రంలోనే యూఎస్ కోల్పోవాల్సి వచ్చింది. ఇరాన్ గగనతలంలో ఉండగా ఓ ఎఫ్-35ఏ విమానంపై దాడి జరిగింది. ఐదవ తరం ఫైటర్ జెట్ అయిన ఎఫ్-35పై దాడి జరగడం ఇదే తొలిసారి. మిత్రదేశాల పొరపాటు కారణంగా మూడు ఎఫ్-15వీ ఫైటర్ జెట్లను నష్టపోయినట్టు కూడా అమెరికా పేర్కొంది. ఈ-3సీ సెంట్రీ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ విమానం, ఐదు కేసీ-135 రీఫ్యూలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా యూఎస్ కోల్పోయింది. ఇక బీబీసీ కథనం ప్రకారం, ఈ ఘర్షణల్లో సుమారు 13 మంది అమెరికన్ సిబ్బంది కూడా ప్రాణాలు వదిలారు. గాయపడ్డ వారు వందల సంఖ్యలోనే ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
చనిపోయిన చిన్నారుల బ్యాగులతో చర్చలకు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!