Share News

ఇరాన్‌కు డబ్బులు ఇవ్వలేదు.. అవన్నీ ఫేక్ న్యూస్: ట్రంప్

ABN , Publish Date - Jun 16 , 2026 | 08:34 AM

శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్‌కు ఎలాంటి దబ్బులు చెల్లించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్‌కు డబ్బులు ఇవ్వలేదు..  అవన్నీ ఫేక్ న్యూస్: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి స్థాపన కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధ్రువీకరించాయి. అయితే, ఒప్పందంలోని అంశాలపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇకపై ఎన్నడూ అణ్వాయుధం కోసం తాము ప్రయత్నించమని ఇరాన్ చెప్పిందని అన్నారు. డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్‌కు అమెరికా 300 బిలియన్ డాలర్లు చెల్లించిందన్న వార్తలను కూడా తోసిపుచ్చారు. అవన్నీ ప్రతిపక్ష డెమోక్రాట్లు వ్యాపింప చేస్తున్న అవాస్తవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరాన్ రాజీకొచ్చేలా డబ్బులు చెల్లించినట్టు వార్తలు వైరల్‌ కావడంతో ట్రంప్ స్పందించాల్సి వచ్చింది. యూఎస్ 300 మిలియన్ డాలర్లు చెల్లించినట్టు కథనాలు వెలువడ్డాయి. 300 బిలియన్ డాలర్ల వరకూ చెల్లించి ఉండవచ్చని మరికొన్ని కథనాలు వెలువడ్డాయి.


యాక్సియోస్ మీడియా సంస్థ కథనాల ప్రకారం, ఉద్రిక్తతలను దశల వారీగా తగ్గించేందుకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. యూరేనియం నిల్వలను తగ్గించుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. భవిష్యత్తులో అణు ఇంధన శుద్ధిపై కూడా చర్చించేందుకు ఇరాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుత ఇరాన్ అణుకార్యక్రమం యథాతథ స్థితిలో కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా అమెరికా అదనపు ఆంక్షలు విధించకూడదన్న అవగాహన కుదిరింది. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి అంశాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలను చూదవండి:

ఎయిర్‌బేస్‌లో కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్.. 8 మంది సజీవ దహనం..

యూఎస్-ఇరాన్ డీల్.. 19న జెనీవాలో సంతకాలు!

Updated Date - Jun 16 , 2026 | 09:00 AM