ఎయిర్‌బేస్‌లో కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్.. 8 మంది సజీవ దహనం..
ABN , Publish Date - Jun 16 , 2026 | 06:56 AM
అమెరికా సైన్యానికి చెందిన బీ-52 బాంబర్ ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని మిలటరీ ఎయిర్‌బేస్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూయార్క్, జూన్ 16: అమెరికా సైన్యానికి చెందిన బీ-52 బాంబర్ ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని మిలటరీ ఎయిర్‌బేస్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో భోజన విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘రొటీన్ టెస్ట్ మిషన్‌లో భాగంగా బీ-52 బాంబర్ ఉదయం 11.20 గంటల సమయంలో గాల్లోకి లేచింది‘..
‘గాల్లోకి లేచిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 8 మంది ఉన్నారు. వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నాన్ కమర్షియల్ విజటర్ పాస్‌లను తాత్కాళికంగా నిలిపి వేశాము’ అని చెప్పుకొచ్చింది. ఇక, ఈ ప్రమాదంపై ఎయిర్ బేస్ అధికార ప్రతినిధిని మీడియా ప్రశ్నించగా.. ఆయన మరింత సమాచారం ఇవ్వడానికి తిరస్కరించారు.
అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం..
బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్, సబ్‌సోనిక్ యుద్ధ విమానం. బీ-52 యుద్ధ విమనాలను బోయింగ్ సంస్థ తయారుచేస్తోంది. 1950 నుంచి ఈ యుద్ధ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి 70 వేల పౌండ్ల యుద్ధ సామాగ్రిని రవాణా చేయగలవు. అణు ఆయుధాలతో పాటు అత్యాధునిక క్షిపణులు, బాంబులను మోసుకెళ్లగలవు. బీ-52 బాంబర్లు దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. శత్రుదేశాల రక్షణ వలయాలను ఛేదించి, సుదూర ప్రాంతాలపై దాడి చేయడం వీటి ప్రత్యేకత.
ఇవి కూడా చదవండి