Share News

ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేసే యోచనలో యూఎస్!

ABN , Publish Date - Apr 11 , 2026 | 08:26 PM

విదేశీ బ్యాంకుల్లోని ఇరాన్ నిధులపై ఆంక్షలను ఎత్తేసే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేసే యోచనలో యూఎస్!
US Iran frozen funds

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులపై ఆంక్షలను ఎత్తేసే యోచనలో యూఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఖతార్‌తో పాటు ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో ఇరాన్‌కు దాదాపు 6 బిలియన్ డాలర్ల వరకూ నిధులు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నిధుల బదిలీకి అడ్డంకులు తొలగించే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ వార్తలపై ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. హోర్ముజ్‌లో రాకపోకలపై ఆంక్షలను తొలగించేందుకు నిధులపై ఆంక్షలను రద్దు చేయాలని పేర్కొన్నారు.


మీడియా కథనాల ప్రకారం, దక్షిణకొరియాకు ముడి చమురు అమ్మకాల ద్వారా ఇరాన్‌కు ఈ నిధులు అందినట్టు తెలుస్తోంది. 2018లో ట్రంప్ ఆంక్షలు విధించాక ఈ నిధులను ఇరాన్ విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. 2023లో ఇరాన్ యూఎస్ మధ్య ఖైదీల మార్పిడిలో భాగంగా ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో అవి ఖతార్ బ్యాంక్ అకౌంట్స్‌లోకి బదిలీ అయ్యాయి. ఆ తరువాత మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి జరపడంతో పరిస్థితి తలకిందులైంది. దీంతో, అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ నిధులపై మళ్లీ ఆంక్షలు విధించారు. ఇక పశ్చిమాసియాలో శాంతినెలకొల్పే దిశగా పాక్‌లో యూఎస్, ఇరాన్ బృందాలు నేడు చర్చలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలతొలగింపుపై యూఎస్ మళ్లీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలు శాశ్వతంగా సద్దుమణగాలంటే లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ పట్టుబడుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

Updated Date - Apr 11 , 2026 | 09:59 PM