Share News

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:08 PM

కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా ఒక భారత నౌక హోర్ముజ్‌ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొన్ని రోజుల్లో భారత్‌కు చేరుకుంటుంది.

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..
Jag Vikram LPG tanker

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక తొలిసారిగా ఒక భారత రిజిస్టర్డ్ నౌక హోర్ముజ్‌ జలసంధిని సురక్షితంగా దాటింది. ఎల్‌పీజీతో బయలుదేరిన జగ్ విక్రమ్ నౌక శుక్రవారం రాత్రి జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో, మార్చి నుంచి ఇప్పటివరకూ హోర్ముజ్‌ను దాటిన భారత సరకు రవాణా నౌకల సంఖ్య 9కి చేరింది. అంతేకాకుండా, ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ జలాల్లో మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు ఉన్నాయి. ఇవి కూడా త్వరలో హోర్ముజ్‌ను దాటనున్నట్టు తెలుస్తోంది.

మీడియా కథనాల ప్రకారం, శనివారం మధ్యహ్నానికి జగ్ విక్రమ్ నౌక హోర్ముజ్‌‌కు తూర్పున ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమాన్ జలాల్లో ప్రయాణిస్తోంది. ఈ నౌకలో సుమారు 20 వేల టన్నుల ఎల్‌పీజీ ఉన్నట్టు సమాచారం. మధ్యస్థాయి సరకు రవాణా సామర్థ్యం కలిగిన ఈ నౌక ముంబై‌లోని గ్రేట్ ఈస్టర్న్ కంపెనీకి చెందినది. మరికొన్ని రోజుల్లో ఈ నౌక భారత్‌కు చేరుకుంటుంది.


గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచీ అనేక నౌకలు హోర్ముజ్‌కు పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్‌ జలాల్లో నిలిచిపోయాయి. జగ్ విక్రమ్‌తో పోలిస్తే రెండింతల సామర్థ్యం ఉన్న గ్యాస్ క్యారియర్లు కూడా వీటిల్లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లోని భారత నౌకల్లో ఒక ఎల్‌పీజీ ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్‌ఎన్‌జీ క్యారియర్, ఒక కెమికల్ ఉత్పత్తుల ట్యాంకర్, మూడు కంటెయినర్ ట్యాంకర్లు, రెండు బల్క్ క్యారియర్లు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ట్యాంకర్లకు మరమ్మతులు జరుగుతున్నట్టు సమాచారం.


ఈ వార్తలనూ చదవండి:

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. సగటున రోజుకు ఒక విహంగాన్ని కోల్పోయిన యూఎస్

చనిపోయిన చిన్నారుల బ్యాగులతో చర్చలకు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

Updated Date - Apr 11 , 2026 | 05:19 PM