Share News

అమెరికాలో మళ్లీ ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 10:10 PM

అమెరికాలో మళ్లీ ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు కమ్ముకున్నాయి.

అమెరికాలో మళ్లీ ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు
US government shutdown

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మళ్లీ ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు కమ్ముకున్నాయి. యుద్ధం కోసం అదనపు నిధులు విడుదల చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా చట్టసభలను (కాంగ్రెస్‌) కోరారు. మిలిటరీ వ్యయాలపై ఇప్పటికే ప్రతిపక్ష డెమోక్రాట్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోతే ప్రభుత్వం మళ్లీ స్తంభించిపోవచ్చన్న భయాలు నెలకొన్నాయి.

అమెరికా మీడియా కథనాల ప్రకారం, అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌ను 350 బిలియన్ డాలర్ల అదనపు నిధులను కోరారు. నిధుల విడుదల దిశగా ఏకాభిప్రాయానికి వచ్చేందుకు అధికార ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం లేదు. డిసెంబర్ 11లోపు కాంగ్రెస్ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో నిధుల లేక ప్రభుత్వం స్తంభించే ముప్పు ఉంది.


అమెరికా చట్టసభల సభ్యులు త్వరలో థాంక్స్ గివింగ్ పండుగ సెలవులపై వెళ్లనున్నారు. వారు తిరిగొచ్చాక నిధులకు ఆమెదం తెలిపేందుకు కేవలం 11 రోజుల సమయమే ఉంటుంది. మిడ్‌టర్మ్ పోరు తరువాత ఇరు పార్టీలూ అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇటీవల మిడ్‌టర్మ్స్‌లో గెలుపొందిన డెమోక్రటిక్ పార్టీ సభ్యులు జనవరిలో ప్రమాణస్వీకారం చేస్తారు. దీంతో, కాంగ్రెస్‌లో ప్రతిపక్ష పార్టీ ఆధిపత్యం మొదలవుతుంది.


ఈలోపు నిధుల విడుదలపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం ఎలా కుదురుతుందో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘యుద్ధానికి నిధులు విడుదల చేయడం మాకు ఇష్టం లేదు. కానీ ప్రభుత్వం షట్‌డౌన్ కావాలని కూడా కోరుకోవట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా తెలియదు’ అంటూ తమ మందున్న సందిగ్ధావస్థను డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ పీటర్ వెల్చ్ కళ్లకు కట్టినట్టు వివరించారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో ఎన్నికలు.. టాస్‌ గెలిచిన వ్యక్తే విజేత

బాలీలో 50 అడుగుల వినాయక విగ్రహం.. గిన్నిస్ రికార్డు

Updated Date - Nov 20 , 2026 | 10:10 PM