Share News

బాలీలో 50 అడుగుల వినాయక విగ్రహం.. గిన్నిస్ రికార్డు

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:46 PM

బాలీలో ఇటీవల ఏర్పాటు చేసిన 50 అడుగుల వినాయక విగ్రహం గిన్నిస్ రికార్డులోకెక్కింది.

బాలీలో 50 అడుగుల వినాయక విగ్రహం..  గిన్నిస్ రికార్డు
Bali Ganesha statue Guiness Record

ఇంటర్నెట్ డెస్క్: బాలీలో ఇటీవల ఏర్పాటు చేసిన 50 అడుగుల వినాయక విగ్రహం గిన్నిస్ రికార్డులోకెక్కింది. సింథటిక్ రట్టన్‌తో (పాలీఇథినీల్ ప్లాస్టిక్) నిర్మించిన అతిపెద్ద కళాఖండంగా గుర్తింపు సొంతం చేసుకుంది. అలాస్ హరూమ్ బాలీ అనే కళాకారుడు ఈ విగ్రహాన్ని రూపొందించారు. న్యూఢిల్లీలోని ఇండోనేషియా ఎంబసీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బాలీలోని గియాన్యార్‌లో ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ విషయాలను ఇండోనేషియాలోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ధ్రువీకరించింది.


ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశంపై హిందూ, బౌద్ధమతాల ప్రభావం కూడా ఉంది. అక్కడి ఆలయాలు, శిల్పాలు, కళలు, సంప్రదాయాల్లో ఈ ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇక బాలీలో హిందూమత ప్రభావం మరింత ఎక్కువ. అక్కడి దైనందిన జీవితంలో అడుగడుగునా ఈ ప్రభావం కనిపిస్తుంటుంది. బాలీ ద్వీపంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. స్థానికంగా వీటిని పురా అని పిలుస్తుంటారు. రామాయణం నేపథ్యంగా అక్కడి నాటకాల్లో సంప్రదాయక నృత్యాలను ప్రదర్శిస్తుంటారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాను కదిలించిన భారతీయ వృద్ధురాలు! కాంగ్రెస్‌లో కొత్త బిల్లు

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

Updated Date - Nov 20 , 2026 | 06:46 PM