అమెరికాలో ఎన్నికలు.. టాస్ గెలిచిన వ్యక్తే విజేత
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:22 PM
ఫ్లోరిడాలోని అట్లాంటిక్ బీచ్ సిటీ కమిషన్ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లోరిడాలోని అట్లాంటిక్ బీచ్ సిటీ కమిషన్ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థులకు ఒకే రకంగా ఓట్లు రావడంతో చివరకు టాస్ వేసి విజేతను ఎంపిక చేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు నెలల పాటు ప్రచారం తరువాత ఇద్దరు అభ్యర్థుల మధ్య పీటముడి పడటంతో ఎన్నికల అధికారులు ఈ విధానంలో విజేతను నిర్ణయించారు.
వాస్తవానికి నవంబర్ 3నే ఓట్లు లెక్కించారు. సీట్. నెం 4 నుంచి పోటీ పడుతున్న లీసా హెరాల్డ్, జెన్నిఫర్ లాగ్నార్ అనే ఇద్దరు మహిళలకు చెరో 3,192 ఓట్లు వచ్చాయి. దీంతో, టాస్ వేసి విజేతను నిర్ణయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్కడి నిబంధనల ప్రకారం, పీటముడి పడిన సందర్భాల్లో మూడు సార్లు టాస్ వేస్తారు. ఈ క్రమంలో ఎక్కువ సార్లు ఎవరు గెలుస్తారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు.
మొదటిసారి టాస్‌లో లాగ్నార్ గెలిచారు. రెండోసారి కూడా లాగ్నార్ విజేతగా నిలిచారు. దీంతో, మూడోసారి టాస్ వేసే అవసరం లేకపోయింది. లాగ్నార్నే అధికారులు విజేతగా ప్రకటించారు. మొత్తం 20 సెకెన్లలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. టాస్కు ముందు కూడా కొంత సస్పెన్స్ కనిపించింది. నవంబర్ 12న పోస్టులో బాలెట్ పేపర్ వచ్చినప్పటికీ పోస్టు పంపించిన వ్యక్తి సరిగ్గా మార్కు చేయకపోవడంతో అది చెల్లుబాటు కాలేదు. దీంతో, టాస్ ద్వారా విజేతను ఎంపిక చేయాల్సి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
బాలీలో 50 అడుగుల వినాయక విగ్రహం.. గిన్నిస్ రికార్డు
అమెరికాను కదిలించిన భారతీయ వృద్ధురాలు! కాంగ్రెస్‌లో కొత్త బిల్లు