Share News

కెనడా తీవ్ర ఆగ్రహం.. యూఎస్‌పై భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు

ABN , Publish Date - Aug 25 , 2026 | 10:08 PM

అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. తమ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా భారీ స్థాయిలో అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించింది.

కెనడా తీవ్ర ఆగ్రహం.. యూఎస్‌పై భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు
US Canada trade war

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. తమ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా భారీ స్థాయిలో అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 700 వస్తువులపై దాదాపు 20 బిలియన్ డాలర్ల వరకూ సుంకాలను విధిస్తున్నామని కెనడా ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, యూఎస్ సుంకాల భారం నుంచి కెనడా వ్యాపారులు, సంస్థలను కాపాడేందుకు 5.42 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. అమెరికా సుంకాలతో అధికంగా ప్రభావితమయ్యే చిన్న, మధ్యస్థాయి వ్యాపారాల కోసం ఈ ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే నెల 8 నుంచీ ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.


వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇటీవల అర్థాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కెనడాపై దాదాపు ఇదే స్థాయిలో సుంకాలు విధించారు. ఈ నెల 22 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ చర్యను కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆర్థిక దాడిగా అభివర్ణించారు. ‘దాడి జరిగితే యుద్ధం మొదలైనట్టే. మాపై దాడి జరిగింది’ అని అన్నారు. సరిహద్దు భద్రత, ఆటోమొబైల్, పరిశ్రామిక విధానాల విషయంలో కెనడా, అమెరికా మధ్య గతేడాదిగా వివాదం నడుస్తోంది. ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన చర్చల్లో అమెరికా తెచ్చిన ప్రతిపాదనలు తమ ఆర్థిక సార్వభౌమత్యాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయని కెనడా ఆరోపించింది. తమ ప్రతినిధి బృందాన్ని వెనక్కు పిలిపించుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలు విధించగా కెనడా కూడా ప్రతీకార సుంకాలను ప్రయోగించింది.


ఈ వార్తలనూ చదవండి:

రష్యాలో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న మిస్టరీ

ఇరాన్‌తో వాణిజ్యం.. టాప్‌లో ఉన్న దేశం ఇదే..

Updated Date - Aug 25 , 2026 | 10:16 PM