Share News

శ్వేత సౌధంలో మరో సంచలనం! జర్నలిస్టులను అడ్డుకోరాదని కోర్టు చెప్పినా..

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:34 PM

ట్రంప్ సర్కారు మరో సంచలనానికి తెర తీసింది. జర్నలిస్టులను శ్వేత సౌధంలోకి అనుమతించాలని యూఎస్ కోర్టు ఆదేశించినా ఇంకా అనుమతులు రాలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

శ్వేత సౌధంలో మరో సంచలనం! జర్నలిస్టులను అడ్డుకోరాదని కోర్టు చెప్పినా..
White House Ban on Media

ఇంటర్నెట్ డెస్క్: ట్రంప్ సర్కారు మరో సంచలనానికి తెర తీసింది. జర్నలిస్టులను శ్వేత సౌధంలోకి అనుమతించాలని యూఎస్ కోర్టు తేల్చి చెప్పినా కూడా విలేకరులకు అనుమతులు రాలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎమ్‌ఎస్ నౌ, సీఎన్ఎన్, పొలిటికో సంస్థల జర్నలిస్టులకు గురువారం కూడా శ్వేత సౌధంలోకి అనుమతి లేకపోవడంతో వారు మరోసారి కోర్టు మెట్లెక్కారు.


శ్వేత సౌధంలోకి ఆ మూడు సంస్థల జర్నలిస్టులు 14 రోజుల పాటు కాలుపెట్టకుండా ట్రంప్ సర్కారు నిషేధించిన విషయం తెలిసిందే. జాతీయ భద్రత పేరిట యూఎస్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మూడు మీడియా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం ట్రంప్ సర్కారు ఆదేశాలను కొట్టేసింది. తమ నిర్ణయానికి తగిన ఆధారాలను ట్రంప్ సర్కారు చూపించలేకపోయారని న్యాయమూర్తి చెప్పారు. అంతేకాకుండా, న్యాయప్రక్రియలను కూడా ఉల్లంఘించారని అన్నారు. జర్నలిస్టులను అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు.


అయినప్పటికీ కూడా కొందరు జర్నలిస్టులకు శ్వేత సౌధంలోకి వెళ్లేందుకు అనుమతి రాకపోవడంతో వారు తమ న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. తమ కేసుపై తక్షణ విచారణ చేపట్టాలని మరోసారి కోర్టును ఆశ్రయించాయి. సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికో సంస్థలు అసత్యాలు వ్యాప్తి చేస్తున్నాయని సెప్టెంబర్ 18న ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి ఛాన్స్ ఇక వాళ్లకు ఉండకూడదని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

హూతీల ముప్పు.. మక్కాలో మళ్లీ అలర్ట్

అమెరికా మళ్లీ దాడి చేస్తే, హిందూ మహాసముద్రానికీ యుద్ధాన్ని విస్తరిస్తాం..

Updated Date - Sep 24 , 2026 | 10:55 PM