అర్ధరాత్రి ఇరాన్ మిసైల్ దాడులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్..
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:48 PM
మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిసైల్స్ దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిసైల్స్ దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియాతో ట్రంప్ ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ దాడులపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ‘మన శత్రువులను అత్యంత ఘోరంగా దెబ్బకొట్టబోతున్నాం. వారికి గట్టి బుద్ధి చెప్పబోతున్నాం’ అని అన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ అప్రమత్తమై.. ఇరాన్ ప్రయోగించిన అన్ని మిసైళ్లను గాల్లోనే విజయవంతంగా కూల్చేసింది. అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్