ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. చర్చలు విఫలమైతే మరిన్ని దాడులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 07:52 AM
ఇరాన్‌తో అమెరికా చర్చలు జరపనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జలమార్గాలను బ్లాక్ చేయడం తప్ప.. ఇరాన్ దగ్గర మరో ఆస్త్రం లేదని అన్నారు.
న్యూయార్క్, ఏప్రిల్ 11: ఇరాన్, అమెరికా దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (శనివారం) పాకిస్థాన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌లు ఇప్పటికే పాకిస్థాన్ చేరుకున్నారు. ఇరాన్ ప్రతినిధులు కూడా ఇస్లామాబాద్ వచ్చేశారు. మరికొన్ని గంటల్లో చర్చలు మొదలవ్వనున్నాయి. ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానిపై యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
ఇరాన్‌తో అమెరికా చర్చలు జరపనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జలమార్గాలను బ్లాక్ చేయడం తప్ప.. ఇరాన్ దగ్గర మరో ఆస్త్రం లేదని అన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవాలన్నది తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తామని అన్నారు. అత్యుత్తమ ఆయుధాలతో సైన్యం ఇరాన్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇరాన్ బలగాలు సైనికంగా ఓడిపోయాయని అన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
చర్చల ఫలితంతో సంబంధం లేకుండా.. హోర్ముజ్ జలసంధి దానంతట అదే తెరుచుకుంటుందని, త్వరలోనే హోర్ముజ్ జలసంధి తెరుచుకునేలా చేస్తామని అన్నారు. కాగా, ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. శుక్రవారం పెట్టిన ఓ పోస్టులో.. ‘ఇరాన్ యుద్ధం చేసే దానికంటే.. ఫేక్ న్యూస్ మీడియాను, పబ్లిక్ రిలేషన్స్‌ను హ్యాండిల్ చేయటంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో చిన్నారులకు డ్రై రేషన్ కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వం
ఖాజీపేట ఘటన.. ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు