Share News

ఎన్విడియా మాజీ సీఈఓ స్థానాన్ని భర్తీ చేయగలిగేది ఆయనొక్కరే: ట్రంప్

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:18 PM

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా గూఢచారిణితో వివాహేతర సంబంధం నేపథ్యంలో హువాంగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఎన్విడియా మాజీ సీఈఓ స్థానాన్ని భర్తీ చేయగలిగేది ఆయనొక్కరే: ట్రంప్
Donald Trump, Jensen Huang

ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా గూఢచారిణితో వివాహేతర సంబంధం నేపథ్యంలో హువాంగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు. ఎన్విడియాను హువాంగ్ అద్భుతంగా నడిపించారని అన్నారు. ఆయన తప్పుకున్న నేపథ్యంలో సంస్థ పగ్గాలు చేపట్టగలిగేది యాపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్ అని స్పష్టం చేశారు. ఓ లెజండ్ స్థానాన్ని మరో లెజెండ్ మాత్రమే భర్తీ చేయగలరని చెప్పారు. ఆగస్టులో టిమ్ కుక్ యాపిల్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.


జెన్సన్ హువాంగ్ రాజీనామా నేపథ్యంలో సంస్థ మధ్యంతర సీఈఓగా మరో సీనియర్ అధికారిణి కోలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు, తదుపరి సీఈఓ కోసం ఎన్విడియా ఇప్పటికే అన్వేషణ ప్రారంభించింది. ఏఐ ప్రపంచంలో అత్యంత కీలకంగా మారిన ఎన్విడియా నుంచి హువాంగ్ తప్పుకోవడంతో పెద్ద ఖాళీ ఏర్పడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హువాంగ్ తరువాత ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే, ఎన్విడియా విషయంలో ట్రంప్ మెతకవైఖరి అవలంబిస్తున్నారని డెమోక్రాట్లు ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై అమెరికా చట్టసభల సభ్యులు విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విచారణకు సీఈఓ స్వయంగా హాజరుకావాల్సి ఉండవచ్చని సమాచారం.


ఈ వార్తలనూ చదవండి:

కొంపముంచిన ఎఫైర్.. ఎన్విడియా సీఈఓ రాజీనామా

వాషింగ్టన్‌లో కాల్పులు.. ఒకరి మ‌ృతి, నలుగురికి గాయాలు

Updated Date - Nov 12 , 2026 | 10:19 PM