Share News

అమెరికా నియంత్రణలో ఆ డబ్బులు.. ఇరాన్ ఫండ్స్‌పై ట్రంప్ కామెంట్లు..

ABN , Publish Date - Jun 23 , 2026 | 08:13 PM

ఇరాన్‌కు నిధులు ఇవ్వటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆంక్షల సడలింపు ద్వారా అన్‌ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు.

 అమెరికా నియంత్రణలో ఆ డబ్బులు.. ఇరాన్ ఫండ్స్‌పై ట్రంప్ కామెంట్లు..
Iran Frozen Assets

న్యూయార్క్, జూన్ 23: ఇరాన్‌కు నిధులు ఇవ్వటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆంక్షల సడలింపు ద్వారా అన్‌ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు. ఇరాన్ ఆ నిధులను ఆహారం, వైద్య సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్ సోషల్‌’లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..
trump.jpg


‘ఇరాన్ కోసం పంపే నిధులు ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయి. అమెరికన్ రైతులు పండించే మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్‌తో పాటు అమెరికా తయారు చేసిన ఆహారం, వైద్య సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఇరాన్ ఈ నిధులను ప్రత్యేకంగా ఉపయోగిస్తుంది. మానవతా దృక్పథంతో ఆలస్యం కాకముందే, ఇరాన్‌కు సహాయం చేయడం అవసరమని నేను భావిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.


మరో పోస్టులో.. ‘ఆంక్షల సడలింపు ద్వారా విడుదలయ్యే నిధులన్నీ ఆహార కొనుగోళ్ల రూపంలో తిరిగి అమెరికాకే వస్తాయ్. ఇరాన్‌లో 9.1 కోట్ల మంది జనాభా ఉండటంతో ఆహార అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం అమెరికా రైతులకూ ప్రయోజనం చేకూర్చనుంది' అని ట్రంప్ రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 23 , 2026 | 08:17 PM