ఇరాన్‌కు మేము ఎలాంటి డబ్బూ ఇవ్వట్లేదు: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jun 24 , 2026 | 06:33 PM
ఇరాన్‌కు ఆర్థిక సాయం అందించటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు తాము ఎలాంటి డబ్బూ ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు.
న్యూయార్క్, జూన్ 24: ఇరాన్‌కు ఆర్థిక సాయం అందించటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు తాము ఎలాంటి డబ్బూ ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఆస్తులను కూడా విడుదల చేయబోమని తేల్చి చెప్పారు. అవసరమైతే ఇరాన్‌కు ఆహారం కొనుగోలు చేసి ఇస్తామని అన్నారు. ఛార్జీలు లేకుండా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. హోర్ముజ్‌లో ఎలాంటి టోల్ ఛార్జీలు లేవని అన్నారు.
అమెరికా నియంత్రణలో ఆ డబ్బులు..
ట్రంప్ మంగళవారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ఆంక్షల సడలింపు ద్వారా అన్‌ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు. ఇరాన్ ఆ నిధులను ఆహారం, వైద్య సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.
టెహ్రాన్‌లో అణు తనిఖీల వార్తలను ఖండించిన ఇరాన్
టెహ్రాన్‌లో అణు తనిఖీల వార్తలను ఇరాన్ ఖండించింది. ఇరాన్‌లో అణు పరీక్షలు చేపడతామన్న ఐఏఈఏ చీఫ్ గ్రోసీ ప్రకటనను ఇరాన్ దౌత్యవేత్తలు కొట్టిపడేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న తమ అత్యంత సున్నితమైన అణు కేంద్రాలు లేదా అణు రసాయన నిల్వలను పరిశీలించడానికి ఐఏఈఏకి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి
న్యూజిలాండ్ క్రికెట్‌లో విషాదం.. ఐకానిక్ ప్లేయర్ మృతి
SIR జాబితా నుంచి పేరు తొలగిస్తే రేషన్ ఇవ్వరా?.. సుప్రీంకోర్టు ఆశ్చర్యం