మస్క్‌ను కాపాడుకుంటా: ట్రంప్
ABN , Publish Date - Nov 02 , 2026 | 10:52 PM
ప్రత్యర్థుల నుంచి ఎలాన్ మస్క్‌ను రక్షించుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. డెమోక్రాట్లకు మస్క్ టార్గెట్ కాకుండా ఆయనకు ముందస్తు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉందని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రత్యర్థుల నుంచి ఎలాన్ మస్క్‌ను రక్షించుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. డెమోక్రాట్లకు మస్క్ టార్గెట్ కాకుండా ఆయనకు ముందస్తు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉందని చెప్పారు. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో తాము పైచేయి సాధిస్తే ట్రంప్‌నకు ఎన్నికల నిధులిచ్చిన కుబేరులపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని ఇప్పటికే డెమోక్రాట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
మిడ్‌టర్మ్ ఎన్నికల తరువాత పరిస్థితులపై అమెరికా మీడియాతో ట్రంప్ ముచ్చటించారు. డెమోక్రాట్లకు మస్క్ టార్గెట్ కావడం, ఆయనను అరెస్టు చేసే అవకాశాలపై మాట్లాడారు. ప్రస్తుతానికి అదంతా ఊహాగానాలే అయినప్పటికీ మస్క్‌ను తాము కాపాడుకుంటామని అన్నారు. అధికారికంగా ఎలాంటి అభియోగాలు ఇంకా లేకపోయినా అవసరమనుకుంటే ముందస్తు క్షమాభిక్ష జారీకి తాను సుముఖమేని అన్నారు. మునుపటి అధ్యక్షుడు బైడెన్ ప్రసాదించిన క్షమాభిక్షలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పదవి నుంచి దిగిపోయే సమయంలో ఆయన అనేక మందికి క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ‘కాబట్టి, అవసరమనుకుంటే తప్పకుండా చేస్తా’ అని ట్రంప్ అన్నారు.
ప్రతినిధుల సభలో తాము పైచేయి సాధిస్తే అమెరికాలో కార్పొరేట్ పెద్దలు, ట్రంప్‌నకు నిధులు అందించిన దాతలపై దృష్టి సారిస్తామని హౌస్ ఓవర్‌సైట్ కమిటీలోని కొందరు డెమోక్రాట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా మస్క్ 445 మిలియన్ డాలర్ల నిధులందించారు.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ దాడి.. రిఫ్రిజ్రేటర్ల నుంచి వేడి గాలులు
అమెరికా హాలోవీన్ వేడుకల్లో ఘోర హింసాకాండ.. పలు చోట్ల సామూహిక కాల్పులు