ఇరాన్‌పై రెచ్చిపోయిన ట్రంప్! సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:44 PM
ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గుతున్నట్టు కనిపించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌ను ఇష్టారీతిన తిడుతూ నెట్టింట పోస్టు పెట్టారు. మంగళవారం నుంచీ ఇరాన్‌లో నరకం తప్పదని హెచ్చరించారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో పరిస్థితి దిగజారుతుందని హెచ్చరించారు.
‘మంగళవారం పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి’ అంటూ బూతులతో ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికా డెడ్‌లైన్‌ను ఇరాన్ ఖాతరు చేయని నేపథ్యంలో ట్రంప్ నోటికొచ్చినట్టు తిడుతూ సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు పైలట్‌లను అమెరికా సైన్యం తాజాగా కాపాడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మునుపటి డెడ్‌లైన్‌ను మరోసారి గుర్తు చేశారు.

మరోవైపు, ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై ఇరాన్ శనివారం ఘాటుగా స్పందించింది. ఇరాన్‌లో మౌలిక వసతులపై దాడులు జరిగితే అమెరికాకు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ జనరల్ అలీ అబ్దుల్లాహీ ఆలియాబాదీ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ మిలిటరీ స్థావరాలు అన్నిటినీ టార్గెట్ చేస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలూ చదవండి:
ప్రత్యేక బలగాలు, డజన్ల కొద్దీ విమానాలు.. ఎఫ్-25 పైలట్‌ను రక్షించిన యూఎస్
యూఎస్ సైన్యం కదలికలపై చైనా కంపెనీల నిఘా