Share News

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సమస్య.. ఎమర్జెన్సీ స్లైడ్ సడెన్‌గా తెరుచుకుని..

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:35 AM

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినియోగించే ఎయిర్‌ఫోర్స్ వన్‌ విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. ట్రంప్ ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు విమానంలోని ఎమర్జె్న్సీ స్లైడ్‌ను అకస్మాత్తుగా తెరుచుకుంది.

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సమస్య.. ఎమర్జెన్సీ స్లైడ్ సడెన్‌గా తెరుచుకుని..
Airforce One Emergency Slide

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినియోగించే ఎయిర్‌ఫోర్స్ వన్‌ విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. ట్రంప్ ప్రయాణానికి ముందు తనిఖీల సందర్భంగా విమానంలోని ఎమర్జె్న్సీ స్లైడ్‌ను అకస్మాత్తుగా తెరుచుకుంది. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఈ ఘటన జరిగింది. అత్యవసర సందర్భాల్లో విమానం నుంచి కిందకు దిగేందుకు మెట్లకు బదులు ఈ స్లైడ్‌ను వినియోగిస్తారు. డాలస్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు ట్రంప్ ఎయిర్‌బేస్‌కు హెలికాప్టర్‌లో వెళ్లారు. ట్రంప్ అక్కడకు చేరుకున్న సమయంలోనే స్లైడ్ తెరుచుకుంది. దీంతో కొన్ని నిమిషాల పాటు ట్రంప్ హెలికాప్టర్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.


ఆ తరువాత ట్రంప్ యథాప్రకారం, డాలస్‌కు ఆ విమానంలో వెళ్లారు. అక్కడ దిగాక విలేకరులు విమానభద్రతపై ట్రంప్‌ను ప్రశ్నించారు. అలాంటి సందేహాలు అవసరమే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏ చిన్న సందేహం ఉన్నా విమానంతో తాను ప్రయాణించనని చెప్పారు. ఈ ఎయిర్‌ఫోర్స్ వన్‌ను ఖతార్ ప్రభుత్వం ట్రంప్‌నకు బహుమతిగా ఇచ్చింది. గతంలో ట్రంప్ వినియోగించే బోయింగ్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాలు పాతపడిపోవడంతో ట్రంప్ ఈ విమానాన్ని వినియోగిస్తున్నారు. కొత్త విమానాలను బోయింగ్ సరఫరా చేసే వరకూ ట్రంప్ వీటిని వినియోగిస్తారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆ మూడు భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోండి: యూఎస్ సెనెటర్లు

కాగ్నిజెంట్‌కు షాకిచ్చిన యూఎస్

Updated Date - Sep 10 , 2026 | 01:39 PM