22 కోట్ల అమెరికా ఓటర్ల వివరాలను చైనా తస్కరించింది: ట్రంప్
ABN , Publish Date - Jul 17 , 2026 | 09:03 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా హ్యాకింగ్‌కు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
న్యూయార్క్, జులై 17: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా హ్యాకింగ్‌కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. చైనా అక్రమంగా 220 మిలియన్ల (22 కోట్లు) అమెరికన్ ఓటర్ల సమాచారాన్ని దొంగిలించిందని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్ వద్ద దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను జో బైడెన్ చేతిలో ఓడిపోయిన ఆ ఎన్నికలు ఓ పెద్ద ‘ఎలక్షన్ నైట్‌మేర్’ అని ట్రంప్ అభివర్ణించారు.
ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘యూఎస్ ఇంటెలిజెన్స్ అసెస్‌మెంట్లు, నివేదికలు బహిర్గతం చేస్తున్నాం. మా దేశ ఎన్నికల ప్రక్రియకు చైనాతో ప్రమాదం ఉంది. అమెరికా ఓటర్ల జాబితా విదేశీ ప్రభుత్వాల చేతుల్లో ఉంది. మా ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ కౌంటింగ్ ప్రమాదంలో ఉన్నాయి. మా ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి చైనా, ఇతర దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఓటరు ఐడీ, పౌరసత్వ నిరూపణ లేకుండానే ఓటు వేస్తున్నారు. యూఎస్ ఎన్నికల వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం అవుతోంది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇరాన్‌పై యుద్ధంలో అతిపెద్ద విజయం సాధించాం. అమెరికాకు త్వరలోనే యుద్ధ ఫలితాలు అందుతాయి. యూఎస్ సరిహద్దులన్నీ ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అమెరికా సురక్షితమైన దేశం’ అని అన్నారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2017 నుంచి జనవరి 20, 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ఉన్నారు. 2020 నవంబర్ నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. చైనా కుట్ర కారణంగానే తాను ఓడిపోయానని ట్రంప్ ఆరోపణలు చేయటం మొదలెట్టారు. అయితే, ఫలితాలను తారుమారు చేసేంత మోసాలు ఆ ఎన్నికల సమయంలో జరగలేదని అమెరికా కోర్టులు.. దర్యాప్తు సంస్థలు.. జస్టిస్ డిపార్ట్‌మెంట్ తేల్చాయి.
ఇవి కూడా చదవండి
ఇరాక్ సంచలన ప్రకటన.. ట్రంప్ హత్యకు 10 మిలియన్ డాలర్ల రివార్డ్!
ఉదయం పరగడుపున ఖర్జూరాలు తినడం మంచిదేనా?