Share News

సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్.. రెండు సార్లు ఫోన్ చేసినా..

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:25 PM

హూతీ దాడులతో సతమతం అవుతున్న సౌదీ అరేబియాకు అమెరికా నుంచి ఆశించిన మేర సాయం అందలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్.. రెండు సార్లు ఫోన్ చేసినా..
Trump, Saudi Prince MBS

ఇంటర్నెట్ డెస్క్: హూతీ దాడులతో సతమతం అవుతున్న సౌదీ అరేబియాకు అమెరికా నుంచి ఆశించిన మేర సాయం అందలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హూతీలపై దాడులు చేయాలని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) రెండు సార్లు ఫోన్‌లో అభ్యర్థించినా ట్రంప్ నో చెప్పినట్టు ఆక్సియోస్ మీడియా సంస్థ పేర్కొంది. తొలిసారి ఫోన్ చేసిన సౌదీ యువరాజు తాజా పరిస్థితిని వివరించారు. హూతీలపై దాడులు చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌నకు విజ్ఞప్తి చేశారు. ట్రంప్ నో చెప్పడంతో ఆ తరువాత మరోసారి ఇదే అభ్యర్థన చేశారు. కానీ ట్రంప్ మాత్రం రెండో సారి కూడా సౌదీ యువరాజు అభ్యర్థనను తోసిపుచ్చారు. పశ్చిమాసియాలో మరో యుద్ధానికి తెరతీడయం ట్రంప్‌నకు ఏమాత్రం ఇష్టం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, హూతీలను అడ్డుకునేందుకు అవసరమైన నిఘా సమాచారం అందిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.


హూతీలకు చెక్ పెట్టేందుకు మక్కా ఒప్పందం ప్రకారం సహకరిస్తామని సౌదీకి ఇటీవల హామీ ఇచ్చిన పాకిస్థాన్ కూడా వెనక్కు తగ్గింది. హూతీలపై నేరుగా దాడులు చేయబోమని స్పష్టం చేసింది. మక్కా ఒప్పందం కేవలం రక్షణాత్మకమైనదని చెప్పుకొచ్చింది. హూతీలపై దాడుల చేసే విషయమై తాము ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఆలోచన చేయట్లేదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

మరోవైపు, తుర్కియే సాయం తీసుకునేందుకు కూడా సౌదీ సంశయిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎర్రసముద్రం, బాబ్ అల్ మండెబ్ జలసంధిపై సౌదీ తన ఆధిపత్యం కొనసాగాలని కోరుకుంటోంది. హూతీలపై దాడుల పేరిట ఆ ప్రాంతంలో తుర్కియే తన సైన్యం ప్రాబల్యాన్ని విస్తరించే అవకాశం ఉందని సౌదీ భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మోదీ-పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిపై సమీక్ష

పుతిన్ విమానం అంత ప్రత్యేకమా? ‘డూమ్స్‌డే ప్లేన్’లో ఉన్న సదుపాయాలివే!

Updated Date - Sep 11 , 2026 | 07:33 PM