Share News

ఇరాన్ యుద్ధం కోసం రూ.18 లక్షల కోట్లు కావాలి.. అమెరికా పార్లమెంట్‌కు పెంటగాన్ ప్రతిపాదన..

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:14 PM

ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించాలంటే రాబోయే రోజుల్లో 200 బిలియన్ డాలర్లు (రూ.18 లక్షల కోట్లు) అవసరమవుతాయని పెంటగాన్ ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా పార్లమెంట్‌కు పెంటగాన్ ఓ నివేదికను పంపించిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇరాన్ యుద్ధం కోసం రూ.18 లక్షల కోట్లు కావాలి.. అమెరికా పార్లమెంట్‌కు పెంటగాన్ ప్రతిపాదన..
Pentagon Iran war budget 200 billion

ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించాలంటే రాబోయే రోజుల్లో 200 బిలియన్ డాలర్లు (రూ.18 లక్షల కోట్లు) అవసరమవుతాయని పెంటగాన్ ఓ ప్రతిపాదనను పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా పార్లమెంట్‌కు పెంటగాన్ ఓ నివేదికను పంపించిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం కోసం అమెరికా ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది (Pentagon Iran war budget 200 billion).


వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఈ కథనంపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ అజెండాను అమలు చేసేందుకు సొంత పౌరుల పైనే అమెరికా భారం మోపుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ విమర్శించారు. 'ఇరాన్, అమెరికాలను ఇజ్రాయెల్ యుద్ధంలోకి లాగి ఇప్పటికి కేవలం మూడు వారాలు మాత్రమే అయింది. ఇజ్రాయెల్ అజెండా కోసం అమెరికా లక్షలాది కోట్లు ఖర్చుపెడుతోంది. 200 బిలియన్ డాలర్లు అంటే చిన్న మొత్తమే. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సాధారణ అమెరికన్లు కృతజ్ఞతలు చెప్పాలి' అని అబ్బాస్ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు (US war spending).


ఈ యుద్ధంలో పాల్గొనడం అమెరికాకు ఇష్టం లేదని, కేవలం నెతన్యాహు వల్లే అగ్రరాజ్యం యుద్ధంలోకి దిగిందని ఇటీవల అబ్బాస్ వ్యాఖ్యానించారు (US defense budget Iran conflict). అగ్రరాజ్యంలోని ఇజ్రాయెల్ లాబీ, కొందరు అధికారుల కారణంగా సాధారణ అమెరికన్లు యుద్ధ భారాన్ని మోస్తున్నారని అబ్బాస్ పేర్కొన్నారు. కాగా, యుద్ధం కోసం పెంటగాన్ కోరుతున్న 200 బిలియన్ డాలర్లు ఇరాన్ డీజీపీలో సగం కంటే ఎక్కువే కావడం గమనార్హం.


ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..


మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 19 , 2026 | 06:21 PM