యూఎస్‌లో హంతకుడికి త్వరలో మరణ శిక్ష.. లైవ్ స్ట్రీమింగ్!
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:42 AM
ఫోర్ట్ హుడ్ మిలిటరీ స్థావరంలో కాల్పులకు తెగబడి 13 మంది మరణానికి కారణమైన మాజీ మిలిటరీ అధికారి, సైకియాట్రిస్ట్ నిడల్ హసన్ మలిక్ మరణశిక్షణ అమలును లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫోర్ట్ హుడ్ మిలిటరీ స్థావరంలో కాల్పులకు తెగబడి 13 మంది మరణానికి కారణమైన మాజీ మిలిటరీ అధికారి, సైకియాట్రిస్ట్ నిడల్ హసన్ మలిక్ మరణశిక్షణ అమలును లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ స్వయంగా ప్రకటించారు. డిసెంబర్ 3న ఫైరింగ్ స్క్వాడ్‌తో (తుపాకీతో కాల్పులు) ఈ మరణ శిక్ష అమలు చేయనున్నారు. బహిరంగంగా శిక్ష అమలు చేస్తామని మొదట ప్రకటించిన మంత్రి హెగ్సెత్ ఆ తరువాత లైవ్‌స్ట్రీమింగ్ చేస్తామని చెప్పారు. అయితే, ఈ లైవ్ స్ట్రీమింగ్‌ను చూసే అవకాశం ఎవరెవరికి ఇస్తారనేది ఇంకా తెలియరాలేదు.
2009లో నిడల్ హసన్ ఈ కాల్పులకు తెగబడ్డాడు. అఫ్గానిస్థాన్‌కు బయలుదేరుతున్న సైనికులను అడ్డుకునేందుకే కాల్పులు చేశానని నిడల్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. ఇక మరణ శిక్షను లైవ్ స్ట్రీమింగ్ చేయడం అంత సులువు కాదని అమెరికా న్యాయనిపుణులు చెబుతున్నారు. నిడల్ కోర్టులను ఆశ్రయించి శిక్ష అమలులో జాప్యం జరిగేలా చేయవచ్చని అంటున్నారు. ట్రంప్ హయాంలో మరణ శిక్ష సాధ్యపడకపోవచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత వచ్చే ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో అమెరికాలో మరణ శిక్షలు పలు కాంట్రవర్సీలకు దారితీస్తున్నాయి. విషపూరిత ఇంజెక్షన్లతో మరణ శిక్ష అమలు ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఈ ఇంజెక్షన్‌లు ఇవ్వడానికి వైద్యులు ముందుకు రావట్లేదని సమాచారం. టెన్నెసీ రాష్ట్రాంలో క్రిస్టా పైక్ అనే నిందితురాలికి ఇటీవల మరణ శిక్ష అమలు ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా ఆమె శ్వాస ఆగలేదు. అసలేం జరిగిందనేది తేల్చేందుకు రాష్ట్ర గవర్నర్ దర్యాప్తునకు ఆదేశించారు. నిందితురాలికి రెండో సారి మరణ శిక్ష అమలు రాజ్యాంగహక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుందా? అని అక్కడి న్యాయనిపుణులు చర్చిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మస్క్‌కు యూఎస్ సైన్స్ మెడల్ ప్రదానం.. ట్రంప్ కితాబు
దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్ కత్తి