Share News

సోషల్ మీడియా కేసు.. 1.72 లక్షల కోట్లు చెల్లించేందుకు మెటా సిద్ధం

ABN , Publish Date - Aug 26 , 2026 | 09:53 PM

చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికాతో మెటా సంస్థ సెటిల్మెంట్ చేసుకుంది.

సోషల్ మీడియా కేసు.. 1.72 లక్షల కోట్లు చెల్లించేందుకు మెటా సిద్ధం
Meta $18 billion settlement

ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికాతో మెటా సంస్థ సెటిల్మెంట్ చేసుకుంది. 18 బిలియన్ డాలర్ల ( ₹1.72 లక్షల కోట్లు) పరిహారాన్ని అమెరికా రాష్ట్రాలకు, యూఎస్ ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలకు చెల్లించేందుకు అంగీకరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాబోయే పదేళ్లల్లో విడతల వారీగా మెటా ఈ మొత్తాన్ని చెల్లించనుంది.

టీనేజర్లు, చిన్నారులు సోషల్ మీడియాకు బానిసయ్యేలా ఇస్టా, ఫేస్‌బుక్ వేదికలను మెటా సంస్థ నిర్వహించిందని అమెరికా రాష్ట్రాలు కేసు వేసిన విషయం తెలిసిందే. చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై పడే ప్రతికూల ప్రభావాన్ని మెటా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అమెరికా రాష్ట్రాలు ఆరోపించాయి. ఈ కేసు విచారణలో ఉండగానే విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు మెటా అంగీకరించింది.


ఈ సెటిల్మెంట్‌లో భాగంగా చిన్నారులపై ప్రతికూల ప్రభావం తగ్గించేలా ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌‌లల్లో మెటా మౌలిక స్థాయిలో తక్షణమార్పులు చేయాల్సి ఉంటుంది. స్కూలు వేళల్లో చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా ఆంక్షలు తీసుకురావాల్సి ఉంటుంది. యూజర్ల వయసును నిర్ధారించే చెక్స్ మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. ఇక మెటా చెల్లించనున్న పరిహారంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆన్‌లైన్‌లో యువత భద్రతను పెంపొందించే కార్యక్రమాలపై వెచ్చించనున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 26 , 2026 | 10:06 PM