Share News

ఎన్విడియా సీఈఓ ఎఫైర్! యూఎస్ మంత్రి హెచ్చరికలు

ABN , Publish Date - Nov 09 , 2026 | 08:03 PM

చైనా మహిళతో ఎన్విడియా సీఈఓ సాన్నిహిత్యంపై యూఎస్ మంత్రి మార్కో రూబీయో ట్రంప్ సర్కారులోని ముఖ్యులను మే నెలలోనే హెచ్చరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎన్విడియా సీఈఓ ఎఫైర్! యూఎస్ మంత్రి హెచ్చరికలు
Marco Rubio flagged Nvidia CEO's affair

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చైనా మహిళతో సన్నిహితంగా ఉన్న విషయం అమెరికా కార్పొరేట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. చైనా మహిళ గూఢచారి అయి ఉండవచ్చన్న వార్తలు యావత్ దేశాన్ని కుదిపేస్తున్నాయి. అయితే, చైనా మహిళ ఆలిస్‌తో జెన్సన్ సాన్నిహిత్యం గురించి ట్రంప్ ప్రభుత్వానికి చాలా కాలం క్రితమే తెలిసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ట్రంప్ ప్రభుత్వంలోని పెద్దలను హెచ్చరిస్తూ లేఖ రాసినట్టు సమాచారం. ఎన్విడియా సీఈఓతో సన్నిహితంగా మెలుగుతున్న మహిళ చైనా గూఢచారిణి అయి ఉండొచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆలిస్‌పై నిఘా సమాచారం అధారంగా ఈ నివేదికను పంపించినట్టు తెలుస్తోంది.


చైనా పౌరురాలైన ఆలిస్ సింగపూర్‌లోని మెగా స్పీడ్ సంస్థలో సీనియర్ అధికారిగా పనిచేశారు. జెన్సన్‌ నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు చైనా ప్రభుత్వం ఆలిస్‌ సాయం తీసుకున్నట్టు అమెరికా నిఘాఅధికారులు నిర్ధారణకు వచ్చిన వైనాన్ని మంత్రి రూబియో లేఖలో పేర్కొన్నారు. మే నెలలో ట్రంప్ చైనా పర్యటనకు ముందు ఈ లేఖను అత్యంత సీనియర్ అధికారులతో పంచుకున్నారు.


ఇక మే నెలలో చైనా పర్యటనకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంట జెన్సన్ మొదట్లో లేకపోవడం అప్పట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. ఈ ఉదంతంపై మీడియాలో వార్తలు రావడంతో ట్రంప్ ప్రభుత్వం రూట్ మార్చింది. ఈ క్రమంలోనే అలాస్కాలో ట్రంప్‌ను కలిసిన జెన్సన్‌ ఆయన వెంట చైనా పర్యటనకు వెళ్లినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా మహిళతో ఎఫైర్ గురించి జెన్సన్ ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. తన భార్యను మోసం చేసినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. భార్యకు పిల్లలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా

వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్

Updated Date - Nov 09 , 2026 | 08:17 PM