Share News

పాక్‌కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో గేమ్స్ వద్దంటూ వార్నింగ్

ABN , Publish Date - Apr 10 , 2026 | 08:10 PM

పాక్‌కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. తమతో గేమ్స్ వద్దని స్పష్టం చేశారు. అయితే, చర్చలు సానుకూలంగానే సాగుతాయని తాము ఆశిస్తున్నామని తెలిపారు.

పాక్‌కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో గేమ్స్ వద్దంటూ వార్నింగ్
JD Vance on Talks With Iran

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు శాశ్వతంగా సద్దుమణగాలని యావత్ ప్రపంచం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు బయలుదేరారు. ఇస్లామాబాద్ వేదికగా రేపు జరగనున్న చర్చల్లో ఆయనతో పాటు అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌ కూడా పాల్గొంటారు.

ఇక ఇస్లామాబాద్‌కు బయలుదేరే ముందు జేడీ వాన్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. సానుకూలంగా చర్చలు సాగుతాయని అనుకుంటున్నాను. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ గతంలో అన్నట్టుగా ఇరానీయన్లు సదుద్దేశంతో చర్చలకు వస్తున్నారని భావిస్తున్నా. మేమూ ఈ దిశగా ముందుకు సాగుతున్నాము. అలా కాని పక్షంలో మా తీరు కూడా వాళ్లకు తెలిసొస్తుంది. ఈ చర్చలకు సంబంధించి అధ్యక్షుడు మాకు ఇప్పటికే స్పష్టమైన సూచనలు చేశారు. కాబట్టి, వారు మాతో గేమ్స్ ఆడాలని చూస్తే మేమూ అందుకు తగ్గట్టే స్పందిస్తాము’ అని వాన్స్ అన్నారు.


ఇక చర్చలపై శ్వేత సౌధం కూడా పరిమితమైన వివరాలనే వెల్లడించింది. ఇరాన్ ప్రతినిధుల నుంచి ఏమి ఆశిస్తున్నారనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, ఈ చర్చలతో మరోసారి వాన్స్ పాత్ర యూఎస్ ప్రభుత్వంలో కీలకంగా మారింది. ట్రంప్ ప్రభుత్వంలో వాన్స్ పాత్ర మొదట్లో పరిమితంగా కనిపించినా ప్రస్తుతం ఆయన కీలక బాధ్యతలను వహిస్తున్నారని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి:

200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

Updated Date - Apr 10 , 2026 | 09:04 PM