Share News

మా వద్ద సూసైడ్ బోట్స్ ఉన్నాయ్: ఇరాన్ మిలిటరీ

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:27 PM

ముడి చమురు రవాణా నౌకలపై దాడి కోసం తమ వద్ద సూసైడ్ బోట్స్ ఉన్నాయని ఇరాన్ మిలిటరీ తాజాగా హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మా వద్ద సూసైడ్ బోట్స్ ఉన్నాయ్: ఇరాన్ మిలిటరీ
Iran suicide boats warning

ఇంటర్నెట్ డెస్క్: తమ వద్ద ఆత్మాహుతి బోట్స్ ఉన్నాయని ఇరాన్ సైనిక దళం తాజాగా హెచ్చరించింది. భూగర్భ సొరంగాల్లో దాచి ఉంచిన రకరకాల డ్రోన్స్, నౌకలను ధ్వంసం చేయగలిగిన మిసైల్స్, నీళ్లల్లో అమర్చే మైన్స్ వంటివి ఉన్న వీడియోను అక్కడి మీడియా విడుదల చేసింది. అయితే, ఈ ఫుటేజీ ఎప్పటిదనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

పర్షియన్ గల్ఫ్‌లో చమురు రవాణా నౌకలపై దాడుల కోసం ఈ పడవలనే వాడినట్టు తెలుస్తోంది. మార్చ్ 1న ఒమాన్ తీరానికి కొద్ది దూరంలో ఒక ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా ఇంజన్ రూమ్‌లో పేలుడు సంభవించి సిబ్బంది ఒకరు మరణించారు. ఆ మరుసటి రోజు బహామాస్ జెండాతో వెళుతున్న మరో నౌకపై దాడి జరిగినా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.


చిన్న పడవలు ఆయిల్ ట్యాంకర్‌లను ఢీకొట్టినట్టు ఉన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు మొదలయ్యాక ఇలాంటి దాడులు పెరిగాయని సముద్రయాన రంగ పరిశీలకులు చెబుతున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ముడి చమురు రవాణా హోర్ముజ్ జలసంధి మీదుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని కూడా ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది.


ఈ వార్తలూ చదవండి:

గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా.. యూఎస్ రక్షణ మంత్రి

ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం.. నలుగురు సిబ్బంది మృతి

Updated Date - Mar 13 , 2026 | 09:34 PM