ఆ ధైర్యం ఉంటే యుద్ధాన్ని కొనసాగించండి.. యూఎస్‌కు ఇరాన్ సవాలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:40 PM
బ్యారెల్ ముడి చమురు ధర 200 డాలర్లకు చేరితే తట్టుకునే ధైర్యం ఉంటే యుద్ధాన్ని కొనసాగించాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అమెరికాకు సవాలు విసిరారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి ఎబ్రహీమ్ జోల్ఫిఘారీ తాజాగా అమెరికాకు సవాలు విసిరారు. బ్యారెల్ ముడి చమురు ధర 200 డాలర్లకు చేరినా భరించే ధైర్యం ఉంటే యుద్ధం కొనసాగించాలని అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్‌లోని ఇంధన నిల్వ కేంద్రాలను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఎబ్రహీమ్ ఈ సవాలు విసిరారు.
ఇరాన్‌లో దేశీ ఇంధన సరఫరాను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ దాడులకు దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డజన్ల కొద్ది ఇంధన నిల్వ ట్యాంకులను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. మిలిటరీ లాజిస్టిక్స్, సివిలియన్ ట్రాన్స్‌పోర్టు, విద్యుత్ ఉత్పత్తి, పాలన సుస్థిరతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఇరాన్‌కు గుండె లాంటి ప్రదేశాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. షహర్-ఏ-రే రిఫైనరీ కాంప్లెక్స్, షహరాన్ తదితర ప్రాంతాల్లో ఇరాన్ దాడులు చేసింది.
యుద్ధం మొదలయ్యాక నేరుగా ఇరాన్ ఇంధన మౌలిక వసతులను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం ఇదే తొలిసారి. మొదట్లో ఇజ్రాయెల్, అమెరికాలు కేవలం మిలిటరీ, న్యుక్లియర్, పరిపాలన కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇక శనివారం ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌లో దేశీయ అవసరాల కోసం ఉద్దేశించిన కేంద్రాలను టార్గెట్ చేశాయి. ఎగుమతుల కోసం ఉద్దేశించిన కేంద్రాలను టార్గెట్ చేయలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి..
ట్రంప్.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు! ఇరాన్ పత్రిక సంచలన కథనం
కొత్త సుప్రీం లీడర్‌ను టార్గెట్ చేయవద్దన్న చైనా