యూఎస్‌తో అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్
ABN , Publish Date - Jul 13 , 2026 | 09:47 PM
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. గతంలో శాంతి స్థాపన కోసం అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేది లేదని ఇరాన్ తాజాగా తేల్చిచెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. శాంతి స్థాపన కోసం గతంలో అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేది లేదని ఇరాన్ తాజాగా తేల్చిచెప్పింది. అవగాహన ఒప్పందాన్ని అమెరికా బహిరంగంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య బంధం అనిశ్చితిలో పడిపోయిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయ్ అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అమెరికానే ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులను కూడా సమర్థించుకున్నారు. స్వీయ రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాల మధ్య గత నెలలో అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇరు దేశాల ప్రతినిధులు స్విట్జర్‌లాండ్‌లో పలుమార్లు సమావేశమై చర్చించారు. అయితే జులై 6న హార్ముజ్ జలసంధిలో మూడు ఆయిల్ ట్యాంకర్‌లపై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే, ఆయిల్ ట్యాంకర్‌లపై దాడికి అవతలి వారే కారణమంటూ ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేశాయి. ఆ తరువాత ఇరు దేశాలు పలుమార్లు పరస్పర దాడులకు దిగాయి. దీంతో గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ సైనిక దళం ఐఆర్‌జీసీతో దేశభద్రతకు ముప్పు: యూకే
హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..