భారత్‌కు బదులు చైనా.. గమ్యాన్ని మార్చుకున్న ఆయిల్ ట్యాంకర్
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:54 PM
ఇరాన్ ముడి చమురుతో భారత్‌కు రావాల్సిన ఒక ఆయిల్ ట్యాంకర్ తన గమ్యాన్ని చైనాకు మార్చుకున్నట్టు షిప్ ట్రాకింగ్ వెబ్‌సైట్ కెప్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ ముడిచమురుతో భారత్‌కు రావాల్సిన ఒక ఆయిల్ ట్యాంకర్ తాజాగా తన గమ్యాన్ని మార్చుకున్నట్టు షిప్ ట్రాకింగ్ వెబ్‌సైట్ కెప్లెర్ పేర్కొంది. పింగ్ షున్ ట్యాంకర్ భారత్‌లోని వడినార్ నౌకాశ్రాయానికి రావాల్సి ఉండగా ప్రస్తుతం నౌక తన గమ్యస్థానం చైనా అని చూపిస్తోందని తెలిపింది. నౌకలోని ట్రాన్స్‌పాండర్ ఈ మేరకు సంకేతాలిచ్చిందని పేర్కొంది. చైనాలోని డోగియింగ్‌కు ఆయిల్ ట్యాంకర్ వెళుతున్నట్టు కెప్లెర్ వెల్లడించింది.
కెప్లెర్ ప్రకారం, పింగ్ షున్‌లో దాదాపు ఆరు లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉంది. మార్చి 4న ఈ ట్యాంకర్ ఖార్గ్ ద్వీపం నుంచి ముడి చమురుతో బయలుదేరింది. ఏప్రిల్ 4న వడినార్‌కు చేరుకోనున్నట్టు అప్పట్లో తెలిపింది. ఇంతలో నౌక తన గమ్యస్థానాన్ని మార్చుకోవడం వెనకున్న కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. గల్ఫ్ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడంతో యూఎస్ ఇటీవల ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 వరకూ ఈ సడలింపు ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం, మార్గమధ్యంలో ఉన్న ఇరాన్ ముడిచమురును ఎవరైనా కొనుగోలు చేయొచ్చు.
2018లో ఇరాన్ ముడి చమురుపై యూఎస్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్ని దేశాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపును ఇచ్చింది. ఆంక్షలకు మునుపు భారత్‌కు రోజుకు సగటున సుమారు 5 లక్షల బ్యారెళ్ల మేర ముడి చమురు దిగుమతి అయ్యేది. 2019 మే నెల తరువాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు దిగుమతులు నిలిచిపోయాయి.
ఈ వార్తలూ చదవండి:
దెబ్బకు దెబ్బ.. 8 గల్ఫ్ బ్రిడ్జ్‌లను టార్గెట్ చేసిన ఇరాన్..
చర్చలకు అంగీకరించనంత వరకు ప్రమాదమే: యూఎన్ చీఫ్