Share News

ఇష్టారీతిన తిడుతూ ట్రంప్ పోస్టు.. స్పందించిన ఇరాన్

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:01 PM

హోర్ముజ్‌ను తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోయడంపై ఇరాన్ తాజాగా స్పందించింది. ట్రంప్ టీనేజర్‌లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఊహించిన దానికంటే ముందుగానే యూఎస్ రాతి యుగంలోకి వెళ్లిపోయిందని ఇరాన్ ఎంబసీ కామెంట్ చేసింది.

ఇష్టారీతిన తిడుతూ ట్రంప్ పోస్టు.. స్పందించిన ఇరాన్
Iran embassy Response to Trump's Post

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిని తెరవాలని తమను తిడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఇరాన్ ఎంబసీ తాజాగా స్పందించింది. ట్రంప్ టీనేజర్‌లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేసింది. ఊహించిన దానికంటే ముందే అమెరికా రాతి యుగానికి చేరుకున్నట్టు ఉందని ఎద్దేవా చేసింది. ఈ మేరకు థాయ్‌ల్యాండ్‌లోని ఇరాన్ ఎంబసీ ఈ పోస్టు పెట్టింది.

హోర్ముజ్‌ను తెరవకపోయినా లేక తమతో ఒప్పందం కుదుర్చుకోకపోయినా ఇరాన్‌లో మంగళవారం నుంచి నరకం కనిపిస్తుందని ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు. పవర్‌ప్లాంట్‌లు, బ్రిడ్జ్‌లపై దాడులతో తొలి రోజు మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన యూఎస్ పైలట్‌లను అమెరికన్ దళాలను రక్షించినట్టు తెలిపిన కొంతసేపటికి ట్రంప్ ఈ పోస్టు పెట్టారు.


అయితే, పైలట్‌ను అమెరికా కాపాడుకున్న వైనంపై కూడా ఇరాన్ స్పందించింది. అమెరికా ఆపరేషన్‌ను దెబ్బతీశామని చెప్పుకొచ్చింది. అమెరికా విమానాలు ధ్వంసమైన దృశ్యాలను షేర్ చేసింది. అయితే, పైలట్‌ను కాపాడుకున్నామన్న అమెరికా ప్రకటనను మాత్రం ఖండించలేదు. ఇదిలా ఉంటే, నేడు కూడా గల్ఫ్ దేశాల్లోని పలు మౌలికవసతులపై ఇరాన్ దాడులు కొనసాగాయి. యూఏఈ, కువైత్, బహ్రెయిన్‌లో పలుచోట్ల మౌలికవసతులు దెబ్బతిన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌పై రెచ్చిపోయిన ట్రంప్! సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టు

ప్రత్యేక బలగాలు, డజన్ల కొద్దీ విమానాలు.. ఎఫ్-25 పైలట్‌ను రక్షించిన యూఎస్

Updated Date - Apr 05 , 2026 | 10:12 PM