Share News

పాక్‌లో చర్చలకు వెళ్లబోమని మేమెప్పుడూ చెప్పలేదు: ఇరాన్ మంత్రి

ABN , Publish Date - Apr 04 , 2026 | 07:27 PM

యుద్ధం ముగింపుపై ఇస్లామాబాద్‌కు వెళ్లి చర్చించబోమని తాము ఎప్పుడూ అనలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తాజాగా పేర్కొన్నారు. అమెరికా బలవంతంగా రుద్దుతున్న షరతులపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

పాక్‌లో చర్చలకు వెళ్లబోమని మేమెప్పుడూ చెప్పలేదు: ఇరాన్ మంత్రి
Abbas Araghchi

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధం ముగింపు దిశగా ఇస్లామాబాద్‌లో జరుగుతున్న చర్చలను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తాజాగా అన్నారు. పాక్ నేతృత్వంలో చర్చలకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్న మీడియా వార్తల నేపథ్యంలో ఇరాన్ మంత్రి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇరాన్ అభిప్రాయంపై అమెరికా మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయని చెప్పారు. పాక్ తీసుకుంటున్న చర్యలకు తాము కృతజ్ఞతతో ఉన్నామని చెప్పారు. ఇస్లామాబాద్‌లో చర్చలకు హాజరు కాబోమని తాము ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు కోసం యూఎస్ తమపై బలవంతంగా రుద్దుతున్న షరతులపైనే తాము స్పందిస్తున్నామని చెప్పారు.

గల్ఫ్‌లో యుద్ధం ముగింపు కోసం పాక్ చొరవతో సాగుతున్న చర్చలు నెమ్మదించాయంటూ ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ చర్చల్లో ఇరాన్ పాలుపంచుకోకపోవడంతో పురోగతి కొరవడిందని అమెరికన్, పాక్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తోసిపుచ్చారు. అవన్నీ కల్పిత కథనాలేనని స్పష్టం చేశారు.


ఇక శుక్రవారం పాక్ విదేశాంగ శాఖ ఇషాక్ దార్ మంత్రి సౌదీ విదేశాంగ శాఖ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో మాట్లాడారు. యుద్ధం ముగింపు కోసం పాక్, చైనా ప్రతిపాదించిన ఐదు పాయింట్ల ప్రణాళికపై చర్చించారు. ఆరు వారాల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్‌లో చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు తప్పవన్న భయాందోళనలు నెలకొన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు దెబ్బ మీద దెబ్బ.. యూఎస్ ఎమ్‌క్యూ -1 డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్..

ఇరాన్‌లో 3,500 మంది.. ఇజ్రాయెల్‌లో 19 మంది.. పశ్చిమాసియాలో భారీ ప్రాణ నష్టం..

Updated Date - Apr 04 , 2026 | 07:52 PM