హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:50 PM
హోర్ముజ్‌ను మూసేసినట్టు ఇరాన్ మళ్లీ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. హోర్ముజ్ వైపు ప్రయాణిస్తున్న అనేక సరకు రవాణా నౌకలు వెనక్కు మళ్లుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ కుదిరాక కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుండటంతో గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లెబనాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్‌ను మూసివేసినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సరకు రవాణా నౌకల రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
మీడియా కథనాల ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక రెండు నౌకలు (గ్రీస్, లైబీరియాలకు చెందినవి) సురక్షితంగా హోర్ముజ్‌ను దాటగలిగాయి. ఆ తరువాత ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అరోరా అనేక నౌక జర్నీకి బ్రేక్ పడింది. జలసంధిని దాటేందుకు తొలుతు ముందుకెళ్లిన నౌక ముసందం తీరం వద్ద వెనక్కు మళ్లినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇప్పటికే చైనాకు చెందిన కొన్ని సరకు రవాణా నౌకలు హోర్ముజ్‌ను దాటేందుకు వేచి చూస్తున్నట్టు కూడా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా ప్రభుత్వ షిప్పింగ్ సంస్థ కాస్కోతో పాటు మరో సంస్థ హీ రాంగ్ హాయ్‌కు చెందిన నౌకలు హోర్ముజ్ జలసంధికి కొద్ది దూరంలో పర్షియన్ గల్ఫ్ జలాల్లో వేచి చూస్తున్నట్టు సమాచారం. ఇవి జలసంధిని దాటాయా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ వార్తలూ చదవండి:
ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తేవడంతో..
పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదు.. ఇజ్రాయెల్ రాయబారి