Share News

మరో అమెరికా విమానం కూల్చివేత.. ఇరాన్ మీడియాలో కథనం

ABN , Publish Date - May 29 , 2026 | 10:40 AM

మరో అమెరికా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చేసినట్టు స్థానిక మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, అమెరికా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది.

మరో అమెరికా విమానం కూల్చివేత.. ఇరాన్ మీడియాలో కథనం
Another US Plane Downed, Says Iran Media

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతం గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని భద్రతా దళాలు కూల్చేశాయని ఇరాన్ మీడియా తస్నీమ్ ఒక కథనాన్ని ప్రచురించింది. జామ్ కౌంటీ గవర్నర్ మసూద్ టాంగెస్థానీని ఉటంకిస్తూ ఈ వార్తను ప్రచురించింది. ప్రస్తుతం నగరంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని కూడా వెల్లడించింది.

అమెరికా మాత్రం ఈ కథనాన్ని తోసిపుచ్చింది. ఆ ప్రాంతంలో తాము ఏ విమానాన్నీ నష్టపోలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. అంతకుముందు ఇరాన్ సైనిక దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) మరో సంచలన ప్రకటన చేసింది. హోర్ముజ్‌లో నాలుగు నౌకలను టార్గెట్ చేశామని, వీటిల్లో కొన్ని అమెరికాకు చెందినవని చెప్పుకొచ్చింది.


ఇదిలా ఉంటే, ఇరాన్ మిలిటరీ ఆధీనంలోని ఆయిల్ నెట్‌వర్క్‌పై మరిన్ని ఆంక్షలు విధించామని అమెరికా గురువారం తెలిపింది. ఇరాన్ ముడి చమురును రవాణా చేస్తున్న ఎనిమిది నౌకలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్టు చెప్పింది. ముడి చమురు ఆదాయాన్ని పెంచుకుని మిలిటరీని బలోపేతం చేద్దామనుకుంటున్న ఇరాన్‌ను అడ్డుకుంటామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏఐ షార్ట్‌ఫిల్మ్ అతడి జీవితాన్నే మార్చేసింది.. హాలీవుడ్‌లో అవకాశం..

మిత్రదేశం ఒమన్‌కు యూఎస్ గట్టి వార్నింగ్

Updated Date - May 29 , 2026 | 11:16 AM